English | Telugu
మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేసిన నారా రోహిత్ అభిమానులు
Updated : Sep 17, 2015
ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో సినీ హీరో నారా రోహిత్ ఫ్యాన్స్ అధ్యక్షుడు తాడికొండ సాయికృష్ణ ఆధ్వర్యంలో 'మట్టి వినాయక ప్రతిమలను ఉపయోగించి పూజలు చేద్దాం.. ప్రకృతి కాలుష్యాన్ని తగ్గిద్దాం..' అనే నినాదంతో వినాయకచవితి పండుగ సందర్భంగా బుధవారం మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేసారు. ముఖ్యంగా విజయవాడలో రాష్ట్ర నారా రోహిత్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో వీరపనేని శివచైతన్య పెద్ద ఎత్తున మట్టి వినాయకుని ప్రతిమలను పంపిణీ చేసారు.
భారీ వర్షం కురుస్తున్పటికీ మహిళలు సైతం ముందుకొచ్చి 'మట్టి వినాయకుడిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడదాం.. ఇదే మన నినాదం' అంటూ వినాయకుని విగ్రహాలను తీసుకుని నారా రోహిత్ అభిమానులను అభినందించడం అక్కడున్న ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ కార్యక్రమంలో విజయవాడ తెలుగుదేశం పార్టీ నాయకులు దన్నె ప్రసాద్, కావూరి పద్మ, బోండా రవితేజ, మల్లపనేని సతీష్, కంచెర్ల శోభారాణిలతో పాటు నారా రోహిత్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.