English | Telugu

భలే భలేగా సినిమా ప్రమోషన్

నానీ హీరోగా నటించిన భలే భలే మగాడివోయ్ సెప్టెంబర్ 4న సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ చూస్తే నానీ, మారుతి ఇద్దరూ సంథింగ్ స్పెషల్ గా ట్రై చేసి నట్టే కనిపిస్తోంది. ఇప్పుడు సినిమా మార్కెటింగ్ లో కొత్తదనాన్ని ఎంచుకున్నారు.ఏపీ తెలంగాణ లో ఏకంగా 4 కోట్ల ఆర్టీసీ టిక్కెట్ల పై 'భలే భలే మగాడివోయ్' పోస్టర్ వేసి ప్రమోషన్ ప్లాన్ చేశారు. అలాగే డెయిలీ పత్రికల కు రెగ్యులర్గా యాడ్లు ఇస్తూ అందరి కీ టచ్లో ఉంటున్నారు. వెబ్ మీడియా మ్యాగజైన్లు అనే తేడా లేకుండా అందరికీ ప్రకటనలు ఇచ్చి స్పీడ్ అంటే ఎలా ఉంటుందో చూపించారు. మరి ఈ సినిమా నానికి ఎలాంటి హిట్ ఇస్తుందో వేచి చూడాలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.