English | Telugu

రామాయణ మూవీ వాళ్ళకి నచ్చుతుందా, లేదా? నిర్మాత కీలక వ్యాఖ్యలు  

భారతీయ సినీ చరిత్రలో ఇంతవరకు తెరకెక్కని హైబడ్జెట్ తో నిర్మాణం జరుపుకుంటున్న చిత్రం 'రామాయణ'(Ramayana).సుమారు 4000 కోట్ల రూపాయలతో తెరకెక్కుతున్న 'రామాయణ'లో 'రాముడు'(Ramudu)గా రణబీర్ కపూర్(Ranbir Kapoor),సీతమ్మ తల్లిగా 'సాయిపల్లవి'(Saipallavi),'రావణాసురుడు'(Ravanasura)గా 'యష్'(Yash) చేస్తున్నారు. భారతీయుల జీవితాల్లో 'రామాయణం' ఎంతగానో ముడిపడి ఉంది. 'రామాయణం'కి సంబంధించిన ప్రతి అంశం ప్రతి ఒక్క భారతీయుడికి తెలుసు. పైగా ఇప్పటికే ఎన్నో చిత్రాలు కూడా వచ్చాయి. దీంతో 'రామాయణ' ప్రాజక్ట్ ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తిని కలగ చేస్తుంది.

రీసెంట్ గా 'రామాయణ' ని నిర్మిస్తున్న 'నమిత్ మల్హోత్రా'(Namit Malhotra)ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు 'రామాయణ' ని ఇంతవరకు ఎవరు తెరకెక్కించని విధంగా రూపొందిస్తున్నాం. భారతీయ సినిమాపై ప్రపంచం చిన్న చూపు చూసినప్పుడు ఎంతగానో బాధపడ్డాను. దీంతో రామాయణ గురించి ప్రపంచానికి తెలియచేయాలన్న లక్ష్యంగా పని చేస్తున్నాం. అవతార్, గ్లాడియేటర్ లాంటి హాలీవుడ్ చిత్రాల స్థాయిలో ఉండబోతుంది. పాశ్చ్యాత దేశాల వాళ్ళకి 'రామాయణ' నచ్చకపోతే అది మా ఫెయిల్యూర్ కిందకి వస్తుందని చెప్పుకొచ్చాడు.ముంబై కి చెందిన 'నమిత్ మల్హోత్రా' విజువల్స్ ఎఫెక్ట్స్ కి ప్రపంచంలోనే ఎంతో పేరు గాంచిన 'ప్రైమ్ ఫోకస్' కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నాడు. యానిమేషన్ తో పాటు 2 d ,3d కి సంబంధించిన బ్రిటిష్ ఇండియన్ కంపెనీ DNEG కి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా కూడా వర్క్ చేస్తున్నాడు. ఈ రెండు కంపెనీలు ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు విడుదలైన ఎన్నో భాషల చిత్రాలకి, ఆయా విభాగాల్లో తమ పని తీరుతో ప్రేక్షకులని మెస్మరైజ్ చేసారు.

నిర్మాతగా రణబీర్ కపూర్, అలియాభట్ జంటగా వచ్చిన 'బ్రహ్మస్త్ర' తో పాటు పలు ఇంగ్లీష్ చిత్రాల్ని నిర్మించాడు. ముఖ్యంగా గత ఏడాది అమెరికన్ సిల్వర్ స్క్రీన్ పై సంచలనం సృష్టించిన 'ది గార్ల్ ఫీల్డ్' నమిత్ మల్హోత్రా కి మంచి హిట్ ని అందించింది. 60 మిలియన్ డాలర్స్ తో నిర్మించగా 257 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది. ఇక రామాయణ రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా, మొదటి భాగం 2026 దీపావళికి, రెండవభాగం 2027 దీపావళికి రిలీజ్ కానున్నాయి. నితీష్ తివారి(Nitesh Tiwari)దర్శకుడు. భారతీయ చిత్ర సీమలో ఇప్పటి వరకు హయ్యస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న 'దంగల్' తో పాటు ఎన్నో హిట్ చిత్రాలు నితీష్ దర్శకత్వంలో వచ్చాయి.



అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.