English | Telugu

ఎమ్మెల్యే రోజా నిర్మించిన "వన్ అవర్" షార్ట్ ఫిల్మ్ విడుదల

ప్రముఖ సినీ నటి, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా రాజకీయాలతో బిజిగా ఉన్నా కళను మాత్రం మరిచిపోవడం లేదు. కొత్త తరాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించిన రోజా అందుకు షార్ట్ ఫిలిమ్స్‌ను వేదికగా చేసుకున్నారు. ఇందులో భాగంగా స్కై మీడియా బ్యానర్‌‌ పతాకంపై జిబి కృష్ణ దర్శకత్వంలో శ్రీనివాస్ చక్రవర్తి, సందీప్, లతా సంగరాజు, అనిల్ మంత్రిప్రగడ నటినటులుగా "వన్ అవర్‌" అనే లఘు చిత్రాన్ని నిర్మించారు. జరగబోయే విషయాలు ముందే తెలిసే ఒక యువకుడి చుట్టూ కథ తిరుగుతుంది. సస్పెన్స్‌కు తోడు పీవీఆర్ రాజా అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. షార్ట్‌ఫిలిమ్స్‌కు కేరాఫ్‌ ఆడ్రస్‌గా నిలిచిన తెలుగువన్ సంస్థ ఈ చిత్రాన్ని యూట్యూబ్‌లో రిలీజ్ చేసింది. విడుదలైన కొన్ని గంటల్లోనే ఈషార్ట్‌ ఫిలిం ఆన్‌లైన్‌లో దూసుకెళ్తోంది.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.