English | Telugu

దమ్ముందా..పవన్ కి చెప్పండి

మెగాస్టార్ 60వ జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ అభిమానులకు పెద్ద షాకిచ్చాడు నాగబాబు. ఈ ఫంక్షన్ లో పాల్గొనేందుకు వచ్చిన కొందరు పవర్ స్టార్.. పవర్ స్టార్ అంటూ కేకలు వేయడం స్టార్ట్ చేశారు. ఎంతసేపటికి ఆపకపోవడంతో నాగబాబు కాస్త సహనం కోల్పోయారు. '..ఆయన రాకపోతే మేమేం చేస్తాం..మేం రమ్మనమని ఎన్ని సార్లు పిలుస్తామో మీకు తెలుసా....ఎన్నిసార్లు పిలుస్తామో మీకు తెలుసా..తెలుసా..అయినా వాడు రాడు..ఇక్కడ గోల చేయడం కాదు..దమ్ముంటెే.. ఆయననే అడగండి..రమ్మని పిలుచుకురండి..' అనేలా మాట్లాడారు. అయినా వేరే ఛానళ్ల 20 ఏళ్ళ సంబరాలకు వేరే యంగ్ హీరోల ఆడియో లాంచ్ లకు కూడా వెళ్ళే పవన్ కళ్యాణ్.. సొంత ఫ్యామిలీ సంబరాలకు ఎందుకు రావట్లేదని నిజంగానే ఆయనకే తెలియాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.