English | Telugu

నాగచైతన్య 'ఒక లైలా కోసం' ఆడియో డేట్

'మనం' సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న అక్కినేని ఫ్యామిలీ నుంచి మరో సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అక్కినేని నాగచైతన్య నటిస్తున్న'ఒక లైలా కోసం' సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. ఇటీవలే స్విట్జర్ ల్యాండ్ లో సాంగ్స్ కూడా చిత్రీకరించారు. అయితే ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా ఆడియోను ఆగస్ట్ 15న విడుదల చేయడానికి నాగార్జున ప్లాన్ చేస్తున్నారట. గుండెజారి గల్లంతయ్యిందే’ ఫేం విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఈ చిత్రంలో డా. బ్రహ్మనందం, డా. ఆలీ, ప్రభు, నాజర్, ఆశిష్ విద్యార్థి, సుప్రీత్, మధు, ప్రగతి, సుధ, దీక్షా పంత్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై అక్కినేని నాగర్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.