Read more!

English | Telugu

'మజ్ను' గా నాగచైతన్య

అక్కినేనికి దేవదాసు ఎలానో నాగార్జునకి మజ్ను సినిమా అలా. అంతటి ఐడెంటిటీ ఉన్నా ఆ సినిమా టైటిల్ ఇప్పుడు చైతూ సినిమాకి టైటిల్ అయిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్ లో డిష్కసన్ పాయింట్ ఇది. చైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో మలయాళ హిట్ చిత్రం ప్రేమమ్ ని రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి 'మజ్ను' అనే టైటిల్ ని నిర్ణయించారన్నది హాట్ టాపిక్.టైటిల్ కి తగ్గట్టే ఈ సినిమాలో నాగచైతన్య లవర్ బోయ్ గా కనిపిస్తాడు. ముగ్గురు మగువలతో రొమాన్స్ చేసే చాక్లెట్ బోయ్ గా ఆకట్టుకుంటాడు. ఇప్పటికే ఇద్దరు నాయికలు కన్ఫమ్ అయ్యారు. అనుపమ పరమేశ్వరన్ - అమైరా దస్తర్ నాయికలుగా ఫిక్సయ్యారు. మరో నాయికగా ఎంపిక చేయాల్సి వుంది.