English | Telugu

రూ.6 కోట్లు తిరిగిచ్చేసిన ఎన్టీఆర్‌

బ‌డ్జెట్ పెరిగిపోతోంది... పెరిగిపోతోంది అంటూ నిర్మాత‌లు గోల పెడుతున్నారు. స్టార్లు, డైరెక్ట‌ర్లు పారితోషికాలు త‌గ్గించుకొంటే.. బ‌డ్జెట్ ఎక్క‌డ పెరుగుతుంది?? కానీ అలా త‌గ్గించుకొనేంత మంచి మ‌న‌సు ఈ రోజుల్లో ఎవ‌రికి ఉంది. ఎవ‌రి డిమాండ్‌ని వాళ్లు క్యాష్ చేసుకొందామ‌నుకొంటున్నారాయె. ఎవ‌రో ఒక‌రు ముందుకొచ్చి పారితోషికానికి క‌త్తెర్లు వేస్తే గానీ మంచి రోజులు రావు అనుకొంటున్న స‌మ‌మంలో ఎన్టీఆర్ ముందుకొచ్చాడు. తన పారితోషికంలో కోత విధించుకొన్నాడు. టెంప‌ర్‌తో ఈ మంచి సంప్ర‌దాయానికి శ్రీ‌కారం చుట్టాడు. ఎన్టీఆర్ పారితోషికం దాదాపుగా రూ.14 కోట్లు. బాద్‌షా సినిమాకి ఎన్టీఆర్ తీసుకొన్న మొత్తం ఇది. అదీ బండ్ల గ‌ణేష్ ద‌గ్గ‌ర‌. ఈసారి మాత్రం అదే బండ్ల గ‌ణేష్ ద‌గ్గ‌ర‌.. రూ.9 కోట్ల‌కే స‌రిపెట్టుకొన్నాడు. టెంప‌ర్ బ‌డ్జెట్‌ని కంట్రోల్ లో ఉంచాల‌ని ఎన్టీఆర్ తీసుకొన్న నిర్ణ‌యం ఇది. రూ.15 కోట్ల‌కు చేక్ రాయించుకొని.. ఆ త‌ర‌వాత రూ.6 కోట్లు ఎన్టీఆర్ వెన‌క్కి ఇచ్చేశాడ‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు చెబుతున్నాయి. అధికారికంగా మాత్రం ఎన్టీఆర్ రూ.15 కోట్లు తీసుకొన్న‌ట్టు లెక్క‌. పూరి జ‌గ‌న్నాథ్ కూడా త‌న వంతుగా పారితోషికంలో భారీగా కోత విధించుకొన్నాడ‌ట‌. అంతే కాదు... ఎన్టీఆర్‌, పూరిలు షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు త‌న సొంత ఖ‌ర్చుల్నే భ‌రించుకొన్నార్ట‌. సిబ్బంది జీత భ‌త్యాల భారం నిర్మాత‌పై ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డార‌ట‌. అందుకేటెంప‌ర్ త‌క్కువ బ‌డ్జెట్లో పూర్త‌యింద‌ని చెప్తున్నారు. శ‌భాష్ ఎన్టీఆర్‌..!!