English | Telugu
ఎన్టీఆర్ - మధురిమ గొడవ... పూరి క్లారిటీ
Updated : Feb 10, 2015
టెంపర్ సెట్లో ఎన్టీఆర్ - మధురిమ గొడవ పడ్డారా..??? మధురిమ నటనపై ఎన్టీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశాడా.. అందుకు మధురిమ అలిగి సెట్లోంచి వెళ్లిపోయిందా..?? ఒకట్రెండు రోజుల నుంచీ ఈ తరహా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మధురిమకీ టెంపర్ యూనిట్ మధ్య ఏదో జరిగిందన్న గుసగుసలు ఎక్కవయ్యాయి. వీటిపై పూరి జగన్నాథ్ క్లారిటీ ఇచ్చాడు. ``మధురిమ, ఎన్టీఆర్‌ల గొడవ ఉత్తిదే. ఎవరో కావాలని పుట్టించిన పుకారు. మధురిమ చాలా బాగా నటించింది. ఆమె కెరీర్ బాగుండాలని అందరూ కోరుకొంటున్నాం. ఎన్టీఆర్ డబ్బుల కోసం డబ్బింగ్ చెప్పలేదన్న విషయం కూడా వాస్తవం కాదు. టెంపర్ పై వస్తున్న ఇలాంటి పుకార్లు నమ్మొద్దు`` అంటున్నాడు పూరి.