English | Telugu

ఎన్టీఆర్ కి 'టెంపర్' కన్ ఫామ్

జూనియర్ ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ సినిమాకి టైటిల్ ఖాయమైంది. గత కొంతకాలంగా నేనో రకం, షంషేర్‌ అని రకరకాల పేర్లు ఈ సినిమా టైటిళ్లు వినిపించాయి. కానీ ఎన్టీఆర్ పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ సినిమాకు 'టెంపర్‌' అనే టైటిల్‌ పవర్‌ ఫుల్‌ గా వుంటుందని భావించి పూరి ఆ పేరే పిక్సయ్యాడట. 'టెంపర్'లో బూతేమీ లేకున్నా.. టెంప్టేటివ్‌గా, ట్రెండీగాను కనిపిస్తోంది. ఇవాళరేపు ఇలా వుంటేనే క్యాచీగా వుంటుందనే అభిప్రాయమూ వినిపిస్తోంది. అలాగే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మూవీకి 'టెంపర్' అని పేరు పెట్టాడు. ఇంకొన్నాళ్ల తర్వాత రాబోయే సినిమాలకు ఎటువంటి టైటిల్స్ వుంటాయోననే టాక్ వినిపిస్తోంది.