English | Telugu

ప్రాణహాని ఉందన్న మోహన్ బాబుకి మనోజ్ కౌంటర్ 

మంచు మోహన్ బాబు(mohan babu)ఆయన కుటుంబం మధ్య జరుగుతున్న ఆస్తుల గొడవ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.రీసెంట్ గా మోహన్ బాబు తన రెండవ కుమారుడు మనోజ్(manoj)వల్ల తన ప్రాణాలకి ముప్పు ఉందని,రక్షణ కావాలంటూ మోహన్ బాబు రాచకొండ పోలీష్ కమీషనర్ కు ఒక లేఖ ని కూడా రాయడం జరిగింది.

దీంతో ఈ విషయంపై మనోజ్ మాట్లాడుతు నేను ఆస్తుల కోసం ఎప్పుడు ప్రాకులాడ లేదు. ఆస్తులు కావాలని ఇబ్బంది కూడా పెట్టలేదు.డబ్బు కోసం,ఆస్తి కోసం పోరాటం కూడా చేయటం లేదు.నేను నా భార్య సొంత కాళ్ళ మీద నిలబడి సంపాదించుకుంటున్నాం.విద్యాసంస్థల్లో కొన్ని అక్రమాలు జరుగుతుండటంతో బాధితులకు నేను అండగా ఉన్నాను.ఆ విధంగా బాధితుల పక్షాన నిలబడ్డందుకే నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తున్నాను.పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తు నా బిడ్డలు ఇంట్లో ఉండగా ఇలా చేయడం సరికాదు.

నా భార్యాపిల్లలకు రక్షణ లేకుండా పోయిందనే పోరాటం చేస్తున్నాను.కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు ప్రతిసారి ప్రయత్నం చేశాను.ఈ వివాదాల్లో నా కూతుర్ని కూడా తీసుకురావడం చాలా బాధాకరం.కొన్నాళ్ల నుంచి నేను, మౌనిక మా ఇంటి నుంచి దూరంగానే ఉంటున్నాం.నా ముందే నా కుటుంబ సభ్యుల్ని ఉద్యోగులు తీవ్రంగా తిట్టారు. ఇంటిలో ఉండాల్సిన సిసి ఫుటేజీ కెమెరాలు మాయమయ్యాయి.నా అన్న విష్ణు దుబాయ్ కి ఎందుకు వెళ్ళాడో అందరికీ తెలుసు.విష్ణు(manchu vishnu)అనుచరులు విజయ రెడ్డి ,కిరణ్ రెడ్డి సిసి ఫుటేజ్ మొత్తాన్ని మాయం చేశారు. తనతో పాటు భార్య మౌనికపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు.కుటుంబ వ్యవహారాల్లో తనకు రక్షణగా నిలబడాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులని కూడా కోరతానని మనోజ్ చెప్పాడు.


ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.