English | Telugu

సమంత ఇలా దొరికిపోయింది..!

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలుగుతున్న 'సమంత' ఇప్పుడు వివాదాలకు కేరాఫ్ గా నిలుస్తోంది. ఈ బ్యూటీ మొదటి సారిగా మహేష్ 'వన్' మూవీపై కామెంట్స్ చేస్తూ.. ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. అప్పటితో ప్రారంభమైన ఈ ట్విట్టర్ గోల ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మొన్న జరిగిన ఫిల్మ్ ఫేర్ అవార్డు ఫంక్షన్ లో సమంత మహేష్ బాబుతో కలిసి నవ్వుతూ సందడి చేయడంతో గొడవ సద్దుమణిగినట్లేనని అందరూ అనుకున్నారు. అయితే సూపర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం ఇంకా దాని గురుంచి మర్చిపోలేదు. సమంత లేటెస్ట్ మూవీ సికిందర్ లో బికిని వేసిన ఫోటో బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ఫోటో మహేష్ ఫ్యాన్స్ కి ఆయుధంగా మారింది. 'వన్' సినిమా మూవీ పోస్టర్ పై కామెంట్ చేసిన సమంత..ఇప్పుడు ఈ బికిని అవతారంపై ఎలా స్పందిస్తుందోనని ట్విట్టర్ లో మహేష్ ఫ్యాన్స్ ఆమెని ఎగతాళి చేస్తున్నారు. 'అంజాన్'తో కోలీవుడ్ లో తొలి విజయం దక్కుతుందని ఆశించిన సమంతకీ అది దక్కలేదు కాదా మరిన్ని తలనొప్పులు మొదలయ్యాయి. మరి మహేష్ అభిమానుల ఫైర్ ఎప్పుడు చల్లారుతుందో..? సమంత మహేష్ మధ్య వార్ ఎప్పుడూ ఫుల్ స్టాప్ పడుతుందో..? వేచి చూడాలి.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.