English | Telugu

మ‌గ‌ధీర = బాహుబ‌లి

తెలుగు సినిమా సాంకేతికంగా ఎదిగింది అన‌డానికి మ‌గ‌ధీర ఓ సాక్ష్యంగా నిలిచింది. అప్ప‌టి వ‌ర‌కూ టాలీవుడ్‌లో ఉన్న అన్ని రికార్డుల‌నూ బ్రేక్ చేసి సంచ‌ల‌న విజ‌యం సాధించిన చిత్ర‌మిది. స‌రికొత్త ప్ర‌యోగాలు చేయ‌డానికి రాజ‌మౌళికీ హోప్ అందించింది మ‌గ‌ధీర‌. ఇప్ప‌టి బాహుబ‌లికి ఓ విధంగా స్ఫూర్తి మ‌గ‌ధీర అనే చెప్పాలి. అందుకే మ‌గ‌ధీర సెంటిమెంట్ బాహుబ‌లికీ కొన‌సాగించాల‌ని చూస్తున్నాడు రాజ‌మౌళి. బాహుబ‌లిని జూన్ 30న విడుద‌ల చేయాల‌ని భావిస్తోంద‌ట చిత్ర‌బృందం. ఆ రోజే ఎందుకంటే.. అది మ‌గ‌ధీర విడుద‌లైన రోజు. టాలీవుడ్‌లో రికార్డుల ప‌రంప‌ర‌కు తెర‌తీసిన రోజు. అందుకే జూన్ 30న బాహుబ‌లి విడుద‌ల చేయాల‌ని రాజ‌మౌళి అండ్ కో భావిస్తున్నార‌ట‌. క‌నీసం మే చివ‌రి వారంలోక‌ల్లా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్త‌యితే, ప్ర‌చారం కోసం ఓ నెల రోజుల వ్య‌వ‌ధి ఉంటుంది. అందుకోసం చిత్ర‌బృందం రేయింబ‌వ‌ళ్లూ క‌ష్ట‌ప‌డుతోంది. మ‌రి మ‌గ‌ధీర డేట్ ని బాహుబ‌లి ప‌ట్టుకొంటాడో లేదో చూడాలి.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.