English | Telugu

ప‌వ‌న్, అనుష్క‌... కాంబో??

త్రివిక్ర‌మ్ ఇప్పుడు మ‌హేష్ బాబు కోసం స్ర్కిప్టు రాసుకొనే ప‌నిలో ఉన్నాడు. అయితే స‌మాంత‌రంగా `కోబ‌లి`కి సంబంధించిన చ‌ర్చ‌లూ సాగిస్తున్నాడ‌ట‌. మ‌హేష్ బాబు తో సినిమా పూర్త‌వ్వ‌గానే కోబ‌లిని ప్రారంభించాల‌ని ప‌వ‌న్‌, త్రివిక్ర‌మ్‌లు నిర్ణ‌యించుకొన్న‌ట్టు తెలిసింది. ఈ సినిమాలో క‌థానాయిక‌గా ఎవ‌రైతే బాగుంటారు? అనే విష‌యంపై కూడా ప‌వ‌న్, త్రివిక్ర‌మ్‌ల మ‌ధ్య చ‌ర్చ‌సాగింద‌ట‌. త్రివిక్ర‌మ్ ఛాయిస్‌లో ఉన్న నాయిక అనుష్క మాత్ర‌మేన‌ట‌. ఈ విష‌యాన్ని ప‌వ‌న్‌కీ చెప్పాడ‌ట‌. ప‌వ‌న్ కూడా అనుష్క విష‌యంలో సానుకూలంగా స్పందించిన‌ట్టు తెలుస్తోంది. ప‌వ‌న్ - అనుష్కల కాంబినేష‌న్ ఇప్ప‌టి వ‌ర‌కూ చూసే ఛాన్స్ ద‌క్క‌లేదు. మ‌రి ఆ అవ‌కాశం త్రివిక్ర‌మ్ క‌ల్పిస్తాడేమో చూడాలి. ఈ 2015 చివ‌ర్లో గానీ 2016 ప్రారంభంలోగానీ ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే ఛాన్సుంద‌ని తెలుస్తోంది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.