English | Telugu

శ్రీధర్ సచిన్ కాదంట !

"స్నేహగీతం", "ఇట్స్ మై లవ్ స్టొరీ", "బ్యాక్ బెంచ్ స్టూడెంట్" చిత్రాల దర్శకుడు మధుర శ్రీధర్ తాజాగా ఓ చిత్రం తీయబోతున్నాడు. "ఐ ఆమ్ నాట్ సచిన్" అనేది టైటిల్. క్రికెట్ బెట్టింగ్ ల మాయలో పడిన ఒక క్రికెటర్ అనుకోని పరిస్థితుల వలన ఎలాంటి కష్టాలలో చిక్కుకున్నాడు అన్నది ఈ సినిమా నేపధ్యం. ఈ చిత్రం మే లో షూటింగ్ ముగించుకోనుంది. మల్టీ డైమన్షన్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లిమిటెడ్ సమర్పణలో షిర్డీసాయి కంబైన్స్ పతాకంపై ఎం.వి.కె.రెడ్డి నిర్మించనున్న ఈ చిత్రం మే నెలలో విడుదల కానుంది.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.