English | Telugu
రామ్‌చరణ్‌లా లారెన్స్ చేయగలడా?
Updated : Nov 2, 2019
నటుడిగా రామ్ చరణ్ స్థాయిని పెంచిన సినిమా 'రంగస్థలం'. వినికిడి లోపం గల చిట్టిబాబు పాత్రలో అతణ్ణి తప్ప మరొకరిని ఊహించుకోలేని విధంగా అద్భుతంగా నటించాడు. రామ్ చరణ్ నటనకు జాతీయ అవార్డు వస్తుందని చాలామంది భావించారు. కానీ, రాలేదనుకోండి. ప్రేక్షకుల ప్రసంశలు, బ్రహ్మాండమైన వసూళ్లు వచ్చాయి. ఇప్పుడీ సినిమాను తమిళంలో రీమేక్ చేస్తున్నాడు. రామ్ చరణ్ చేసిన చిట్టిబాబు పాత్రలో కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ రాఘవా లారెన్స్ నటించనున్నాడు. 'పందెంకోడి', 'ఆవారా' సినిమాల డైరెక్టర్ లింగుస్వామి డైరెక్ట్ చేయనున్నాడు.
ఈ వార్త తెలిసిన తెలుగు ప్రేక్షకులకు ఒక్కటే సందేహం... రామ్‌చరణ్‌లా రాఘవా లారెన్స్ నటించగలడా? అంతలా పెర్ఫార్మ్ చేయగలడా? అని. నటుడిగా రాఘవా లారెన్స్ మాస్ సినిమాలు చేశాడు కానీ, క్లాస్ టచ్ ఉన్న మాస్ సినిమాలు చేయలేదు. అతడు నటించి, డైరెక్ట్ చేసిన కాంచన సిరీస్ ఊర మాస్ సినిమా. మన దగ్గర మాస్ ప్రేక్షకులు కూడా మరీ మాస్ గా ఉందన్న సినిమా. రాఘవ లారెన్స్, లింగుస్వామి కలిసి 'రంగస్థలం'ను ఎక్కడ చెడగొడతారో అని మెగా అభిమానులకు భయం పట్టుకుంది.