English | Telugu

'లగ్గం' మూవీ షూటింగ్ పూర్తి!

"ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు" అన్నారు పెద్దలు. "ఇల్లు ఈఎమ్ఐ లో కొనుక్కొవచ్చు ముందు పెళ్ళి చేద్దాంరండి" అంటున్నారు దర్శకుడు రమేష్ చెప్పాల. సుభిషి ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో జనవరిలో 'లగ్గం' మూవీని మొదలుపెట్టి, శరవేగంగా నిన్నటి(శుక్రవారం)తో టాకీ పార్ట్ పూర్తి చేశారు.

“మన తెలుగు కల్చర్ తో జరిగే పెళ్ళిలలో ఉండే మజా, మర్యాదలు, ఆట, పాటలు ప్రతి ఒక్కరికీ వాళ్ళ లగ్గమో, బంధువుల లగ్గమో గుర్తొచ్చేలాచేస్తుందని” ప్రొడ్యూసర్ వేణుగోపాల్ రెడ్డి గారు అన్నారు.

"లగ్గం చిత్రంలో అంతర్లీనంగా మనసుకు హత్తుకునే భావోద్వేగాలు నిండి ఉన్నాయని, ఇది చక్కటి ప్రేమ కథ చిత్రమని" రాజేంద్ర ప్రసాద్ అన్నారు.

ఎల్.బి. శ్రీరామ్, రోహిణి, రఘు బాబు గార్ల నటన సినిమా చూసే ప్రేక్షకులని కట్టి పడేస్తుందని, తన స్టైల్ ఆఫ్ మేకింగ్, స్క్రీన్ ప్లే ప్రజంటేషన్ ఇందులో చూడబోతున్నారని దర్శకుడు రమేశ్ చెప్పాల కాన్ఫిడెంట్ గా చెప్పారు.

పెళ్ళి, షాదీ, లగ్గం, వివాహం ఎలా పిలిచినా జంట ఒకటవ్వడమే. ఒక్కో ప్రాంతంలో ఒక్కోక్క పిలుపు, ఒక్కోక్క ఆచారం. ఈ లగ్గం సినిమా అన్ని వర్గాలను అలరిస్తుంది. తెలుగు సాంప్రదాయం, తెలుగుదనం ఉట్టిపడేలా దర్శకుడు రమేష్ చెప్పాల లగ్గం సినిమాను చిత్రీకరించారని నిర్మాతలు చెబుతున్నారు. చరణ్ అర్జున్ ఈ సినిమా కోసం అద్భుతమైన బాణీలను సమకూర్చారు, 'బేబీ' ఫేమ్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫి లగ్గం సినిమాకు అదనపు ఆకర్షణ కానుందని చిత్ర బృందం చెబుతోంది.

సాయి రోనక్, ప్రగ్యా నగ్రా, రాజేంద్రప్రసాద్, రోహిణి, సప్తగిరి, ఎల్బి.శ్రీరామ్, రఘుబాబు, కృష్ణుడు, రచ్చ రవి తదితరులు నటిసున్న ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.