English | Telugu

ఎట్టకేలకు ఓటీటీలోకి కన్నప్ప 

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపొందిన చిత్రం 'కన్నప్ప' (Kannappa). మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషించారు. మంచి అంచనాలతో జూన్ 27న థియేటర్లలోకి అడుగుపెట్టిన కన్నప్ప.. పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, కమర్షియల్ గా మాత్రం పెద్దగా మ్యాజిక్ చేయలేకపోయింది. (Kannappa On OTT)

కన్నప్ప సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో.. థియేటర్లో మిస్ అయిన వారు, ఓటీటీలో చూడాలి అనుకుంటున్నారు. అయితే ఇటీవల కాలంలో థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకే మెజారిటీ సినిమాలు ఓటీటీలో అడుగుపెడుతున్నాయి. కానీ, కన్నప్ప మాత్రం తొమ్మిది వారాలైనా ఇంతవరకు ఓటీటీలోకి రాలేదు. దీంతో ఈ సినిమా కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు వారి ఎదురుచూపులు ఫలించబోతున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో సెప్టెంబర్ 4 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుందని తాజాగా అధికారికంగా ప్రకటించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. మరి ఓటీటీలో కన్నప్ప సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.