English | Telugu

ఆవకాయ బిర్యానీ కాదు ఇక పప్పన్నమే

"గోదావరి, ఆవకాయ బిర్యానీ, కలవరమాయే మదిలో, ఛత్రపతి, విరోధి, అరవింద్ 2" వంటి చిత్రాలతో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న నటుడు కమల్ కామరాజు త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా చెన్నైలో పనిచేస్తున్న సుప్రియతో అక్టోబర్ 6న నిశ్చితార్ధానికి డేట్ ఖరారు అయిందని, ఇది పెద్దలు కుదిర్చిన వివాహమని తెలిసింది. వీరి పెళ్లి వేడుక డిసెంబర్‌లో జరుగనుందని సమాచారం. మరి టాలీవుడ్ నుండి మరో కుర్రాడు కూడా పప్పన్నం పెట్టించనున్నాడన్నమాట.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.