English | Telugu

నేనేం మూర్ఖుడ్ని కాదు: క‌మ‌ల్‌హాస‌న్‌

క‌మ‌ల్ సినిమా అంటేనే వివాదం. ఏదో విధంగా... విమ‌ర్శ‌కులు ఆ సినిమాని ఇరుకున పెట్టాల‌ని చూస్తుంటారు. తాజాగా ఉత్త‌మ విల‌న్ కూడా ఇందుకు మిన‌హాయింపు కాదు. హిందూమ‌తాన్ని కించ‌ప‌రిచే స‌న్నివేశాలు ఈ సినిమాలో చాలా ఉన్నాయ‌ని.. అందుకే ఈ సినిమాని ఆపేయ‌మ‌ని కొంత‌మంది కోర్టుకెళ్లారు. వాళ్ల‌పై క‌మ‌ల్ నిప్పులు చెరిగాడు. ''మ‌న‌ది ప్ర‌జాస్వామ్య‌దేశం. ఎవ‌రైనా ఏదైనా మాట్లాడొచ్చు. నేను సినిమా తీయ‌డం ఇప్పుడిప్పుడే నేర్చుకొంటున్నా. కొంత‌మంది దాన్ని ఆపాల‌ని చూస్తున్నారు. టికెట్లు కొని సినిమా చూడ‌డం ఓ సంప్ర‌దాయం. ముందే మీ సినిమాలో ఏముందో చూడాల‌ని అడుగుతున్నారు. ఈ ప‌ద్ధ‌తికీ నేను మెల్లిమెల్లిగా అల‌వాటు ప‌డుతున్నా..'' అంటూ ప‌రోక్షంగా త‌న సినిమాని విమ‌ర్శించే వాళ్ల‌ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 75 శాతం జ‌నాభా ఉన్న ఈ దేశంలో హిందువుల్ని కించ‌ప‌రిచే సినిమా తీయ‌డానికి తానేం మూర్జ్ఞుడిని కాద‌న్నాడు. ''నా సినిమా అంద‌రూ చూడాలి.. అంద‌రూ మెచ్చుకోవాల‌నే ఉద్దేశంతోనే సినిమా తీస్తా.. ఆర్ట్ సినిమా అనిపించుకోవాల‌నో, అవార్డుల కోస‌మో సినిమా తీయ‌ను'' అన్నారు క‌మ‌ల్‌. ఆయ‌న న‌టించిన ఉత్త‌మ విల‌న్ మే 1న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.