English | Telugu

'జిల్' విల‌న్ ఫుల్ బిజీ

ఛోటా నాయ‌క్‌.. అంటూ 'జిల్' సినిమాలో విల‌నిజాన్ని పండించిన క‌బీర్ దుహ‌న్ సింగ్ గుర్తున్నాడుగా. త‌న స్టైలీష్ లుక్‌తో ఆ సినిమాకి ఫ్రెష్‌నెస్ తీసుకురావ‌డ‌మే కాకుండా.. 'జిల్' ఎట్రాక్షన్స్ లో త‌న ప్రెజెన్స్‌ని ఒక‌టిగా నిలిపాడు క‌బీర్‌. గోపీచంద్‌తో ఢీ అంటే ఢీ అనే ఆ పాత్ర క‌బీర్ కి తెలుగులో ఎన‌లేని గుర్తింపుని తీసుకువ‌చ్చింది. అతి త్వ‌ర‌లో రానున్న‌ ర‌వితేజ 'కిక్ 2'లోనూ నెగెటివ్ రోల్ ప్లే చేస్తున్న ఈ డైన‌మిక్ విల‌న్‌.. కొత్త చిత్రాలకు సైన్ చేయ‌డంలో ఫుల్ బిజీ అవుతున్నాడ‌ని ఫిల్మ్ న‌గ‌ర్ వ‌ర్గాలు తెలుపుతున్నాయి. బాల‌కృష్ణ 99వ చిత్రం 'డిక్టేట‌ర్‌'లోనూ.. అలాగే సునీల్ హీరోగా వంశీకృష్ణ ఆకెళ్ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న సినిమాలోనూ క‌బీర్ విల‌న్ గా న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. 'శౌర్యం' శివ త‌మిళంలో రూపొందిస్తున్న అజిత్ కొత్త చిత్రంలోనూ క‌బీర్ ప్ర‌తినాయ‌కుడుగా న‌టిస్తున్నాడు. మొత్త‌మ్మీద‌.. ద‌క్షిణాదికి క‌బీర్ సింగ్ రూపంలో మాంచి విల‌న్ దొరికేసాడు. బ‌క‌రా విల‌న్ క్యారెక్ట‌ర్‌ల‌ను కాకుండా ప‌వ‌ర్‌ఫుల్ విల‌న్ రోల్స్‌ను అత‌ను ఎంచుకుంటే గ‌నుక‌.. సౌత్ లో బెస్ట్ విల‌న్‌గా క‌బీర్ గుర్తింపు తెచ్చుకుంటాడ‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.