English | Telugu

జయసుధ సంచలనం..బోరు పడలేదనే 100 కోట్లు స్థలం అమ్మేసాను

సహజ నటి జయసుధ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. నటిగా ఆమె సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. రచయితలు తన కోసమే పాత్రల్ని పుట్టించారా అనుకునే రీతిలో ఆమె సినీ ప్రస్థానం కొనసాగింది. ఒకటి కాదు రెండు కాదు 54 ఏళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక బ్రాండ్ సృష్టించుకొని ముందుకు దూసుకుపోతుంది. తాజాగా ఆమె చెప్పిన ఒక న్యూస్ తో యావత్తు తెలుగు సినీ ప్రేమికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.

సినిమా పరిశ్రమ చెన్నైలో ఉన్నప్పుడు జయసుధ చెన్నైలో కొన్ని ఆస్తులని కొంది. వాటిల్లో 9 ఎకరాలు ల్యాండ్ కూడా ఒకటి. నీళ్ల కోసమని ల్యాండ్ లో బోరుని తవ్వించింది. కానీ బోర్ పడలేదు. దీంతో ఆ స్థలాన్ని అమ్మేసింది. దాని విలువ ఇప్పుడు 100 కోట్లు పైనే ఉంది. ఈ విషయాన్ని స్వయంగా ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో జయసుధే చెప్పింది. అలాగే ఒక పెద్ద భవంతిని కూడా అమ్మేశానని చెప్పింది. ఆయా ప్రాపర్టీ స్ కొన్నపుడు దివంగత శోభన్ బాబు గారు తనని అభినందించారని కానీ వాటిని నిలుపుకోలేక పోయానని చెప్పింది.

1972 లో వచ్చిన పండంటి కాపురం తో జయసుధ తెలుగు సినీ రంగ ప్రవేశం చేసింది. ఆమె అసలు పేరు సుజాత. ప్రముఖ తమిళ దర్శకుడు గుహనాధన్ ఆమె పేరుని జయసుధగా మార్చాడు. తెలుగు,తమిళ,మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కలిపి మొత్తం 200 సినిమాలకి పైగానే చేసింది. నేటికీ తను ఒక సినిమాలో ఉందంటే చాలు ఆమె కోసమే సినిమాకి వాళ్ళు ఎంతో మంది. రాజకీయాల్లోను చురుగ్గా ఉన్నారు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.