English | Telugu

అతడే నా భర్త..  మరో మార్గం లేదు  

మాన్ ఆఫ్ మాసెస్ 'ఎన్టీఆర్'(Ntr)వన్ మాన్ షో 'దేవర' తో 'జాన్వీ కపూర్'(Janhvi Kapoor)తెలుగు సినీ రంగ ప్రవేశం చేసి తన అద్భుతమైన నటనతో అలరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ 'రామ్ చరణ్'(Ram Charan)ప్రెస్టేజియస్ట్ మూవీ 'పెద్ది'(Peddi)ద్వారా మరో సారి తన సత్తా చాటడానికి సిద్దమవుతుంది. త్వరలోనే తెలుగులో అగ్ర హీరోయిన్ గా మారే అవకాశం ఉందనే మాటలు కూడా సినీ సర్కిల్స్ లో వినపడుతున్నాయి. జాన్వీ కపూర్ ఈ రోజు 'పరం సుందరి'(Param Sundari)అనే కొత్త మూవీతో, బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సిద్దార్ధ్ మల్హోత్రా హీరోగా చెయ్యగా రివ్యూస్ పర్లేదనే స్థాయిలోనే వస్తున్నాయి.

పరం సుందరి ప్రమోషన్స్ లో భాగంగా 'జాన్వీ కపూర్' రీసెంట్ గా ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ పోర్టల్ 'ఐఎండిబి' నిర్వహించిన 'స్పీడ్ డేటింగ్' ప్రోగ్రాం లో పాల్గొంది.ప్రోగ్రాం రూల్ ప్రకారం ఇంటర్వ్యూలో పాల్గొన్న వాళ్ళు తమ మొదటి ప్రేమ,డేటింగ్ గురించి చెప్పాలి. దీంతో జాన్వీ కపూర్ మాట్లాడుతు 'నేను ఇప్పటికి చాలా సార్లు వివాహం అయ్యిందని చెప్పాను. విదేశాలకి వెళ్ళినప్పుడు చాలా మంది యువకులు నాతో చనువుగా ఉండటానికి ప్రయత్నించే వారు, అడక్కుండానే హోటల్ రూమ్ కి రకరకాల ఫుడ్ ఐటమ్స్ తెచ్చే వాళ్ళు. దాంతో వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి 'ఓర్రీ'(Orry)తో నా పెళ్లి అయ్యిందని చెప్పాను. ఈ విధంగా చాలా సార్లు జరిగిందని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది.

'ఓర్రీ' అనే వ్యక్తి ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. పూర్తి పేరు ఓర్హాన్ అవత్రమణి. ఫ్యాషన్ డిజైనర్ గా కూడా బాలీవుడ్ సినీ సర్కిల్స్ లో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఎంతో మంది బాలీవుడ్ నటీనటులు, స్టార్ కిడ్స్‌తో సన్నిహితంగా ఉంటాడు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .