English | Telugu

నా బాబు పుట్టాక నాకు హెల్త్ ప్రాబ్లమ్ వచ్చింది.. భర్త అమెరికన్ యాక్టర్ 

కొంత మంది హీరోయిన్లకి పరిచయాలు అక్కర్లేదు. పేరు చెబితే చాలు వాళ్ళ ట్రాక్ రికార్డు మొత్తం కళ్ళ ముందు మెదులుతుంది. అలాంటి హీరోయిన్లలో ఒకరు ఇలియానా. మోస్ట్ లీ తెలుగు చిత్ర సీమలో ఉన్న బడా హీరోలందరితోను జతకట్టింది. ఒకానొక టైంలో నెంబర్ వన్ హీరోయిన్ అనిపించుకుని తన సత్తా కూడా చాటింది. అలాంటి ఇలియానాకి సంబంధించిన తాజా న్యూస్ వైరల్ గా మారింది.

ప్రసవం అనంతరం వచ్చే ఒక ఒక రకమైన వ్యాధితో ఇలియానా బాధపడుతుంది. కొంత మంది ఆడవాళ్లు తమకి పుట్టిన బేబీ ని జాగ్రతగా చూసుకోవాలనే తాపత్రయంలో నిద్రలేమితో పాటు ఒత్తిడి సమస్యలని ఎదుర్కుంటారు. అలాంటిప్పుడే ఈ వ్యాధికి గురవుతుంటారు.ఇప్పుడు ఇలియానా కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా చెప్పింది. ఇలాంటి టైంలో తన ఫ్యామిలీ మెంబర్స్ చాలా సపోర్ట్ గా ఉన్నారని చెప్పింది. అలాగే తన ఆరోగ్యంపై పూర్తి శ్రద్ద వహిస్తున్నట్టుగా కూడా ఆమె తెలిపింది.

ఇక ఇలియానా అమెరికన్ యాక్టర్ అండ్ డైరెక్టర్ అయిన మైకల్ డోలాన్ ని పెళ్లి చేసుకుంది. ఈ విషయాన్ని బాబు పుట్టే వరకు ఆమె ఎవరకి చెప్పలేదు. అగస్ట్ 1 2023 న బాబు పుట్టాడు.పేరు కోయి ఫీనిక్స్ డోలన్. ఇలియానా ప్రస్తుతం ఎలాంటి కొత్త సినిమాలని ఒప్పుకోలేదు. ఆమె నటించిన దో ఔర్ ధో ప్యార్ మూవీ మార్చి నెలలో విడుదలకి సిద్ధం అవ్వబోతుంది. అలాగే ఒక వెడ్ సిరీస్ లో కూడా ఆమె నటించబోతుంది.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.