English | Telugu

గుడ్ బై చెప్పనున్న ఇలియానా 

ఇలియానా.. కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు కుర్రకారు కలల యువరాణి గా తెలుగు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన అందాల భామ. అలాగే ఇలియానా లాగా స్లిమ్ గా ఉండాలని ట్రై చేసిన అమ్మాయిలు కూడా ఎంతో మంది ఉన్నారంటే అతిశయోక్తి కాదు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న దాదాపు అందరి టాప్ హీరోల సరసన నటించిన ఇలియానా కి సౌత్ మొత్తంలోనే కోటి రూపాయిలు రెమ్యునరేషన్ తీసుకున్న రికార్డు ఉంది. తన కంటు సొంతంగా అభిమానులని కూడా సంపాదించుకున్న ఇలియానా గురించి వస్తున్న ఒక న్యూస్ ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది.

ఇలియానా తన సినీ కెరీర్ పీక్ లో ఉన్నప్పుడే ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ తన భర్తని మాత్రం ఒక పిల్లవాడు పుట్టాకే అందరికి పరిచయం చేసింది. ఇప్పుడు ఇలియానా ఇండియా నుంచి శాశ్వతంగా వెళ్లిపోతుందనే ప్రచారం జరుగుతుంది. ఆమె పెళ్లి చేసుకున్న మైకల్ డొలాన్ అమెరికా పౌరుడు కావడంతో ఇలియానా అక్కడే సెటిల్ అవ్వబోతుందనే మాటలు వినిపిస్తున్నాయి. తెలుగులో మహేష్ బాబు పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్,ప్రభాస్, అల్లు అర్జున్ ,రవితేజ, రామ్ పోతినేని వంటి టాప్ హీరోలందరి సరసన నటించింది.

తెలుగు సినిమా పరిశ్రమలో తన కెరీర్ పీక్ లో ఉన్నప్పుడే ఇలియానా బాలీవుడ్ లోకి అడుగుపెట్టి రణబీర్, సైఫ్ అలీ ఖాన్ , వరుణ్ ధావన్, షాహిద్ కపూర్, గోవింద, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ లాంటి బడా నటులతో కలిసి నటించింది. ఆ తర్వాత అక్కడ అవకాశాలు లేక మళ్ళీ తెలుగు లో కొన్ని సినిమాలు చేసింది.కానీ సరైన బ్రేక్ వచ్చిన సినిమా ఏది లేక పోవడంతో నిర్మాతలు ఇలియాని పట్టించుకోవడం మానేశారు. తెలుగు తమిళ కన్నడ హిందీ భాషల్లో కలిపి మొత్తం 30 సినిమాలకి పైగా నటించిన ఇలియానా ఉత్తమ నటి కేటగిరిలో ఎన్నో అవార్డుల్ని సైతం గెలుచుకుంది. ఇలియానా ఇండియా వదిలి వెళ్లిపోతుందనే వార్తలతో ఆమె అభిమానులు మాత్రం ఇలియానా ఇక్కడే ఉండి మరిన్ని సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నారు.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.