English | Telugu

పాప‌కు దెబ్బ‌లు త‌గిలాయ‌ట‌

ఈమ‌ధ్య హీరోయిన్లు సైతం యాక్ష‌న్ సీన్స్‌లో త‌ల‌మున‌క‌లైపోతున్నారు. రామ్‌చ‌ర‌ణ్ సినిమా కోసం ర‌కుల్ ఫైట్స్ చేసింద‌ట‌. ఇప్పుడు డైన‌మైట్ కోసం ప్ర‌ణీత కూడా అదే ప‌ని చేసింది. విష్ణు క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఈ చిత్రంలో ప్ర‌ణీత క‌థానాయిక‌. హీరోయిన్ అంటే పాట‌ల్లో, కొన్ని రొమాంటిక్ సన్నివేశాల్లో క‌నిపించి వెళ్లిపోవ‌డం కాదు, ఈ క‌థ‌లో ప్రణీత పాత్ర‌కు చాలా ప్రాధాన్యం ఉంద‌ట‌. అంతేకాదు, ఛేజింగ్ సీన్స్‌లో, యాక్ష‌న్ సీక్వెన్స్‌ల‌లో పాల్గొంద‌ట‌. ఈ షూటింగ్ స‌మ‌యంలో త‌న‌కు దెబ్బ‌లు కూడా తగిలాయ‌ని, మ‌రీ ముఖ్యంగా మోకాళ్లు కొట్టుకుపోయాయ‌ని చెప్తోంది. యాక్ష‌న్ సీన్స్‌లో న‌టించ‌డం అంత తేలిక కాద‌ని, చిన్న చిన్న సీన్ల‌కే త‌న‌కు చెమ‌ట‌లు ప‌ట్టాయ‌ని, పెద్ద పెద్ద ఫైట్స్‌ని హీరోలు ఎలా చేస్తారో అని ఆశ్చ‌ర్య‌పోతోంది ప్ర‌ణీత‌. హీరోల క‌ష్టం... ప్ర‌ణీత‌కు ఇలా తెలిసొచ్చిందేమో..?

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.