English | Telugu

ఎంఎల్ఏ బాలయ్యకు ఫస్ట్ బర్త్ డే

పౌరాణిక పాత్రల్లో రాముడిగా, కృష్ణుడిగా
ఫ్యాక్షన్ పాత్రల్లో నరసింహుడిగా
పవర్‌ఫుల్ పాత్రల్లో నటసింహంగా
రొమాన్స్, ఫైట్స్, డాన్స్ లతో అదరగొట్టగల టాలీవుడ్ బ్లాక్ బస్టర్ హీరో
బాలకృష్ణ..

సింహం కడుపున సింహమే పుడుతుంది... ఇది నందమూరి బాలయ్యకు అక్కినేని ఇచ్చిన
కితాబు.15నవ ఏట అన్నాదమ్ముల అనుబంధం సినిమాలో బాలకృష్ణ నటన చూసి ముచ్చటపడి ఆ
రోజు అక్కినేని చెప్పిన మాట అక్షరాల నిజం అయ్యింది. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ
నందమూరి తారక రామారావు నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న నటసింహం నందమూరి
బాలకృష్ణ తన సినీ ప్రస్థానంలో ఇప్పటివరకు 97 సినిమాల్లో నటించారు. ఎన్నో
సూపర్ హిట్ చిత్రాలు అందించారు.



ఎన్టీఆర్‌ దంపతులకు ఆరో సంతానంగా మద్రాసులో 1960, జూన్‌ 10న జన్మించారు
బాలకృష్ణ. హైదరాబాదు నిజాం కాలేజిలో డిగ్రీ వరకు చదువుకున్నారు. తాతమ్మ కల
చిత్రంతో 14 ఏళ్ళ వయసులో తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత రామ్‌ రహీం, ‘అన్నదమ్ముల
అనుబంధం’ చిత్రాల్లోనూ నటించారు. ఎన్టీఆర్‌ స్వీయ దర్శకత్వం వహించిన దాన వీర
శూర కర్ణ, అక్బర్‌ సలీం అనార్కలి, శ్రీ మద్విరాట పర్వం, శ్రీ తిరుపతి
వేంకటేశ్వర కల్యాణం, శ్రీ మద్విరాట్‌ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర, బ్రహ్మర్షి
విశ్వామిత్ర చిత్రాల్లో ఎంతో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించి భేష్
అనిపించుకున్నారు. తండ్రి ఎన్టీఆర్‌తో పాటు మరో లెజెండ్ అక్కినేనితో
భార్యభర్తల బంధం సినిమాలో నటించారు.

1984లో ‘సాహసమే జీవితం’ సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యారు బాలకృష్ణ.
వాసు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా గొప్ప కలెక్షన్లు రాబట్టలేకపోయింది. హిందీలో
వచ్చిన డిస్కోడ్యాన్సర్‌ సినిమాకి రీమేక్‌గా వచ్చిన సినిమా డిస్కో కింగ్‌. ఈ
సినిమా నుంచే బాలకృష్ణ డాన్సింగ్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడని
చెప్పొచ్చు. వీటి తర్వాత బాలకృష్ణ కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో జననీ జన్మభూమి
అనే చిత్రంలో నటించారు. ఈ సినిమాలేవి బాక్స్ ఆఫీస్ దగ్గర గొప్ప విజయాన్ని
సాధించలేకపోయాయి. హీరోగా కెరీర్ మొదలుపెట్టిన తర్వాత 4, 5 ఏళ్లపాటు
కమర్శియల్‌గా ఆయన సినిమాలు విజయం సాధించ లేకపోయాయనే చెప్పాలి. కానీ ఆ తర్వాత
బాలకృష్ణ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వరద సృష్టించాయి.



ముఖ్యంగా బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన అపూర్వ సహోదరులు చిత్రం అప్పట్లో
గొప్ప విజయం సాధించింది. అదే ఏడాది వరుసగా ఆయన ఆరు చిత్రాల్లో నటించారు. ఇక 90
దశకం నుంచి బాలకృష్ణ సినిమా అనగానే అభిమానులు భారీ అంచనాలు పెట్టుకోవటం
మొదలుపెట్టారు. బి.గోపాల్‌ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన లారీడ్రైవర్‌, రౌడీ
ఇన్స్‌పెక్టర్‌ లాంటి చిత్రాలు బాలకృష్ణకి కొత్త ఇమేజ్‌‌ని తెచ్చిపెట్టాయి.
అదే దశకంలో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ఆదిత్య 369, భైరవ ద్వీపం
సినిమాలు బాలయ్య కెరీర్‌లో మరిచిపోలేని మేటి చిత్రాలు.
1999లో సమరసింహారెడ్డి చిత్రంతో బాలకృష్ణ తెలుగు సినీ పరిశ్రమలో సరికొత్త
రికార్డు నెలకొల్పారు. ఫ్యాక్షన్ తరహా చిత్రాలకు బాలకృష్ణ ఫస్ట్ చాయిస్‌గా
మారారు. ఆ తర్వాత కాలంలో అదే తరహా నేపథ్యంలో వచ్చిన నరసింహనాయుడు చిత్రం కూడా
తెలుగు సినీ రికార్డులను తిరగరాసింది. ఒక దశాబ్దానికి పైగా ఫ్యాక్షన్,
యాక్షన్, పొలిటికల్ డ్రామా చిత్రాలకు నందమూరి ప్రాణం పోశారు.
బాలయ్య తొడకొట్టడం, పీకలు నరకటం, బాంబులు, సుమోలు పేల్చే పాత్రలలోనే కాదు,
రసరమ్య పౌరాణిక పాత్రలలో నటించి నేటికి అభిమానులను మెప్పిస్తున్నారు. సింగీతం
దర్శకత్వంలో వచ్చిన శ్రీకృష్ణార్జున విజయం, రాఘవేంద్ర రావు డైరెక్ట్ చేసిన
పాండురంగడు, బాపు దర్శకత్వంలో రూపొందిన శ్రీరామరాజ్యం లాంటి పౌరాణిక
చిత్రాల్లో నటించారు. ఈ పాత్రలకు ఆయన తప్ప మరొకరు న్యాయం చేయ లేరని
నిరూపించారు. వైవిధ్యభరిత పాత్రలెన్నో చేసిన బాలకృష్ణ ఇప్పటికి 97 చిత్రాలు
పూర్తిచేశారు.

తాజాగా ఆయన 98వ చిత్రం జూన్ 2న మొదలైంది.
సినిమా, రాజకీయాలు ఆయన కుటుంబంలో పాలు, నీళ్లుగా కలిసిపోయి వున్నాయి. 2014లో
ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి, హిందూపురం నుంచి ఎంఎల్ఏగా ఎంపికయ్యారు.
ఎంఎల్ఏగా తొలి పుట్టినరోజు జరుపుకోబోతున్న బాలకృష్ణ సినిమాలతో పాటు
రాజకీయాలలోను మరింతగా రాణించాలని నందమూరి అభిమానులు ఆశిస్తున్నారు. 55వ
పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతోంది తెలుగువన్ .

(జూన్, 10 బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా)

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.