English | Telugu

మళ్ళీ వార్తల్లోకి  హనుమాన్.. అసలు నిజం తెలుసుకుంటే మీ పరిస్థితి ఏంటి  

ఇప్పుడు అంజనాదేవి మానస పుత్రుడు హనుమాన్ (hanuman)హీరోలకే హీరో అయ్యాడు.ఇదీ నా రేంజ్ అంటున్నాడు.తగ్గేదేలే అని కూడా చెప్తున్నాడు. నేను తలుచుకుంటే ఆల్ రికార్డ్స్ మటాష్ అని బల్ల గుద్ది మరీ చెప్తున్నాడు. అసలు హనుమాన్ ఎందుకు అంత కాన్ఫిడెన్స్ గా ఉన్నాడు.ఇంతకీ ఏం సాధించాడో చూద్దాం

తేజ సజ్జ (teja sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (prashanth varma) దర్శకత్వంలో మొన్న సంక్రాంతికి వచ్చిన మూవీ హనుమాన్. టైటిల్ కి తగ్గట్టే హనుమాన్ ని ప్రధాన కథా వస్తువుగా ఎంచుకొని మూవీ తెరకెక్కింది. అంటే హనుమాన్ ని కూడా ఒక హీరోగా భావించవచ్చు.విడుదలైన అన్ని చోట్ల కూడా మంచి విజయాన్ని దక్కించుకుంది. వరల్డ్ వైడ్ గా 330 కోట్ల రూపాయలకి పైగా కలెక్షన్స్ ని రాబట్టి కలెక్షన్ల సునామీనే సృష్టించింది. ఇక లేటెస్ట్ గా మరో అరుదైన ఘనతని దక్కించుకుంది .మొత్తం 25 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకోనుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా తమ విజయంలో భాగమైన హనుమంతుడికి కృతజ్ఞతలు కూడా తెలిపారు.

ప్రస్తుత సినీ యుగంలో ఎంత పెద్ద హిట్ సినిమా అయినా మూడు నాలుగు వారాలకే పరిమితమవుతుంది. అలాంటిది హనుమాన్ 100 రోజులు జరుపుకోవడం గ్రేటే. పైగా ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే హనుమాన్ గత నెలలో ఓటిటి వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయినా సరే 100 రోజులుని జరుపుకుంటుంది.దీన్ని బట్టి హనుమాన్ ఎంత శక్తిమంతుడో అర్ధం అవుతుంది. అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, సముద్ర ఖని తదితరులు ముఖ్య పాత్రలని పోషించారు. నిరంజన్ రెడ్డి నిర్మాత. 50 రోజులని 150 థియేటర్స్ లో జరుపుకుంది.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.