English | Telugu

గోవిందుడుకి ఆ పాట అక్కర్లేదు..!

తెలుగువన్ ముందుగా చెప్పినట్లే 'గోవిందుడు అంద‌రివాడేలే' ఆడియోలో ఆరు పాటలున్నప్పటికి సినిమా ఐదు పాటలే మాత్రమే కనబడనున్నాయి. గోవిందుడుని అక్టోబ‌రు1న రిలీజ్ చేయాలనే తొందరలో యూనిట్ సభ్యులు ఓ పాట చిత్రీకరణ జరపకుండానే షూటింగ్ కి ముగింపు పలికారు. అయితే ఈ పాటను సినిమా విడుదల తరువాత జోడిస్తార‌ట. అయితే ఈ విధానంపై ఇండస్ట్రీలో కొంతమంది విమర్శలు వ్యక్తం చేస్తున్నారట. సినిమా విడుద‌లైయ్యాక పాటను జోడించం కంటే పాట చిత్రీకరణ చేయకపోవడమే నిర్మాతకు మంచిదని అంటున్నారు. ఒకవేళ సినిమా హిట్టైతే పాటే అవ‌స‌రం లేదని.. ఫ్లాప్ అయితే ఆ పాట‌ను జోడించినా వేస్టే కాదని అంటున్నారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.