English | Telugu

'గోవిందుడి...' ఆడియో ముహూర్తం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ నటిస్తున్న‘గోవిందుడు అందరివాడేలే’ ఆడియో రిలీజ్ ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ 15‌న ఈ వేడుకను గ్రాండ్ గా చేయడానికి నిర్మాత ప్లాన్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన రెండు పాటల చిత్రీకరణ లండన్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్ తో సినిమా చిత్రీకరణ పూర్తికానున్నట్లు సమాచారం. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రం రామ్‌చరణ్ కెరీర్‌లో మైలురాయిగా నిలుస్తుందని అంటున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌కి నచ్చేలా అద్భుతంగా కృష్ణవంశీ తెరకెక్కిస్తున్నారట.