English | Telugu

ప‌వ‌న్ సినిమా ఖాయ‌మైంది

గోపాల గోపాల విష‌యంలో సందిగ్థ‌త వీడింది. ఈ సినిమా సంక్రాంతికి వ‌స్తుందా, రాదా? అనే అనుమానాలు ప‌టాపంచ‌లయ్యాయి. ఈ సినిమా సంక్రాంతికి వ‌స్తోంద‌ని చిత్ర‌బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది. ప‌వ‌న్ క‌ల్యాణ్ - వెంక‌టేష్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్న చిత్రం గోపాల గోపాల‌. బాలీవుడ్‌లో ఘ‌న విజ‌యం సాధించిన ఓమైగాడ్ చిత్రానికి ఇది రీమేక్‌. డాలీ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుద‌ల చేస్తామ‌ని ముందు నుంచీ చెప్తూనే ఉన్నారు. అయితే షూటింగ్ ఇంకా పూర్తికాలేద‌ని, అందుక‌ని సంక్రాంతికి రావ‌డం అనుమాన‌మేన‌ని గ‌త కొంత‌కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈనేప‌థ్యంలో చిత్ర‌బృందం క్లారిటీ ఇచ్చింది. గోపాల గోపాల సంక్రాంతికి వ‌చ్చేస్తుంద‌నే తీపి క‌బురు చెప్పింది. చిత్రీక‌ర‌ణ పూర్తికావ‌చ్చింద‌ని, త్వ‌ర‌లోనే ఫ‌స్ట్‌లుక్ చూపిస్తామ‌ని నిర్మాత శ‌ర‌త్‌మ‌రార్ చెబుతున్నారు. డిసెంబ‌రులో ఆడియో విడుద‌ల చేస్తార‌ట‌. అనూప్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మొత్తానికి ప‌వ‌న్ సినిమా ఈ సంక్రాంతికి రావ‌డం ఖాయ‌మ‌న్న‌మాట‌.