English | Telugu

26 ఏళ్ళ `ఘ‌రానా బుల్లోడు`

కింగ్ నాగార్జున‌, ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు కాంబినేష‌న్ లో ప‌లు బ్లాక్ బ‌స్ట‌ర్స్ రూపొందాయి. వాటిలో `ఘ‌రానా బుల్లోడు` ఒక‌టి. `అన్న‌మ‌య్య‌` కంటే ముందు వ‌చ్చిన ఈ సినిమానే.. నాగ్, రాఘ‌వేంద్ర‌రావు కాంబినేష‌న్ లో వ‌చ్చిన ఆఖ‌రి సోష‌ల్ మూవీ కావ‌డం విశేషం. నాగార్జున‌కి జంట‌గా రమ్య‌కృష్ణ‌, ఆమ‌ని న‌టించిన ఈ సినిమాలో జ‌య‌చిత్ర‌, ముర‌ళీమోహ‌న్, సుధ‌, జ‌యంతి, శ్రీ‌హ‌రి, బ్ర‌హ్మానందం, కోట శ్రీ‌నివాస‌రావు, నూత‌న్ ప్ర‌సాద్, త‌నికెళ్ళ భ‌ర‌ణి, ఏవీయ‌స్, సుధాక‌ర్, మ‌హేశ్ ఆనంద్ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మిచ్చారు.

స్వ‌ర‌వాణి కీర‌వాణి బాణీల‌తో రూపొందిన ఈ మాస్ ఎంట‌ర్ టైన‌ర్ లోని పాట‌ల‌న్నీ జ‌నాద‌ర‌ణ పొందాయి. మ‌రీ ముఖ్యంగా.. ``భీమ‌వ‌రం బుల్లోడా`` పాట అప్ప‌ట్లో ఓ సంచ‌ల‌నం. అలాగే ``సై సై స‌య్యారే``, ``అదిరిందిరో``, ``చుక్క‌ల్లో త‌ళుకులా``, ``ఏం క‌సి ఏం క‌సి``, ``వంగి వంగి`` గీతాలు కూడా మాస్ ని ఊర్రూత‌లూగించాయి. ఆర్.కె. ఫిల్మ్ అసోసియేట్స్ ప‌తాకంపై కె. కృష్ణ మోహ‌న‌రావు నిర్మించిన `ఘ‌రానా బుల్లోడు` 1995 ఏప్రిల్ 27న విడుద‌లై ఘ‌న‌విజ‌యం సాధించింది. నేటితో 26 వ‌సంతాల‌ను పూర్తిచేసుకుంది.

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.