English | Telugu

అల్లు అర్జున్ పై గరికపాటి నరసింహారావు వైల్డ్ ఫైర్ 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(allu arjun)డిసెంబర్ 5 న పుష్ప పార్ట్ 2(pushpa part 2)తో వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇటీవల పాట్నా వేదికగా రిలీజైన ట్రైలర్ ఒక రేంజ్ లో ఉండటంతో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి .2021 లో వచ్చిన పుష్ప పార్ట్ 1 కి కొనసాగింపుగా ఈ మూవీ తెరకెక్కుతుందన్న విషయం తెలిసిందే.

పుష్ప పార్ట్ 1 సమయంలో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచన కర్త గరికపాటి నర్సింహారావు(garikapati narasimha rao)పుష్ప మూవీపై మాట్లాడుతూ స్మ‌గ్లింగ్ చేసే వ్యక్తిని హీరోగా చూపించారు. అదేంటని అడిగితే చివ‌ర‌లో మంచిగా చూపిస్తాం.లేక‌పోతే పుష్ప 2 తీస్తాం, అది కూడా సరిపోకపోతే పార్ట్ 3 తీస్తామంటారు.నువ్వు తీసే వర‌కు స‌మాజం చెడిపోవాలా.ఈ సినిమా కార‌ణంగా స్మ‌గ్లింగ్ గొప్ప అనే భావ‌న వస్తుంది కదా. పైగా స్మ‌గ్లింగ్ చేసేవాడు త‌గ్గేదేలే అంటాడా. అది పెద్ద ఉప‌నిష‌త్తు సూక్తి అయిపోయింది.

ఎవడైనా కుర్రాడు గూబ మీద కొట్టి త‌గ్గేదేలే అంటే దానికి కారణం ఎవరు.ఇలాంటి విష‌యాలు మాట్లాడితే కోప‌మే వ‌స్తుంది. ఈ విషయంలో హీరో, డైరెక్ట‌ర్ నాకు స‌మాధానం చెప్ప‌మ‌నండి.అలాంటి డైలాగుల వ‌ల్ల స‌మాజంలో నేరాలు పెరుగుతున్నాయి.తగ్గేదే లే అని సమాజహితం కోరే హ‌రిశ్చంద్రుడు,శ్రీరామ‌చంద్రుడు వంటి వారు అనాలని చెప్పడం జరిగింది.పుష్ప పార్ట్ 2 రిలీజ్ నేపథ్యంలో ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .