English | Telugu

'గేమ్ ఛేంజర్' టీజర్.. మెగా మాస్ ట్రీట్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'గేమ్ ఛేంజర్' (Game Changer). దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా.. సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ సినిమాపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రెండు పాటలు, కొన్ని పోస్టర్లు విడుదలై ఆకట్టుకున్నాయి. ఇప్పుడు టీజర్ విడుదలైంది. (Game Changer Teaser)

మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'గేమ్ ఛేంజర్' నుంచి తాజాగా టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. నిమిషంన్నర నిడివి ఉన్న ఈ టీజర్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ మూవీని ప్రామిస్ చేస్తోంది. "బేసిక్ గా రామ్ అంత మంచోడు ఇంకోడు లేడు.. కానీ వాడికి కోపమొస్తే వాడంత చెడ్డోడు ఇంకోడు ఉండడు." అంటూ హీరో పాత్రను పరిచయం చేస్తూ టీజర్ ప్రారంభమైంది. ఒక్క డైలాగ్ తోనే హీరో పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో చూపించారు. ఇందులో చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. స్టూడెంట్ గా, ఐఏఎస్ గా కొడుకు పాత్రలో, ప్రజా నాయకుడిగా తండ్రి పాత్రలో కనిపిస్తున్నాడు. చరణ్ లుక్స్ అదిరిపోయాయి. సినిమాలో బలమైన కథతో పాటు, అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయని టీజర్ తో స్పష్టమైంది. టీజర్ లో అడుగడుగునా శంకర్ భారీతనం కనిపిస్తోంది. ముఖ్యంగా సాంగ్స్ శంకర్ శైలిలో విజువల్ ఫీస్ట్ లా ఉండబోతున్నాయని అర్థమవుతోంది. "ఏం చేశాడు వాడు? ఏం చేశాడు వాడు?" అని ముఖపాత్రలతో చెప్పిస్తూ, ఏదో ఊహించనిది హీరో చేశాడనే ఆసక్తిని టీజర్ తో కలిగించారు. "I'm unpredictable..." అంటూ చరణ్ చెప్పే డైలాగ్ తో టీజర్ ని ఎండ్ చేయడం అదిరిపోయింది.

'గేమ్ ఛేంజర్' చిత్రానికి థమన్ సంగీత దర్శకుడు. ఈ సినిమాలో కియారా అద్వానీ, అంజలి, ఎస్.జె. సూర్య, శ్రీకాంత్, సునీల్, జయరామ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.