English | Telugu

గౌతమిపుత్ర శాతకర్ణి లాంఛింగ్ కార్యక్రమానికి ఇద్దరు చంద్రులు

నటసింహం నందమూరి బాలకృష్ణ , క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రానికి సంబంధించి ఏర్పాట్లన్ని చకచకా జరిగిపోతున్నాయి. బాలయ్య కెరిర్‌లోనే మైల్‌స్టోన్‌ మూవీ కావడంతో ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రోటీన్ సినిమాలకు భిన్నంగా చారిత్రక కథాంశంతో సినిమా తీయాలనుకున్నారు బాలకృష్ణ. ఈ చిత్ర పూజా కార్యక్రమాలను ఇవాళ అన్నపూర్ణ స్టూడియోలో గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ఉదయం 10.27 ని.లకు కార్యక్రమం ప్రారంభంకానుంది. బాలక‌ృష్ణతో పనిచేసిన దర్శకులు, ప్రముఖులు, అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.

ఇదంతా ఒక ఎత్తైతే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్‌లు మరోసారి ఒకే వేదిక మీదకు రానున్నారు. మొట్టమొదటి సారిగా ఇద్గరు చంద్రులు ఒక సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఇప్పటికే ఇద్దరు ముఖ్యమంత్రులకు స్వయంగా బాలకృష్ణ ఆహ్వానపత్రికలు అందించారు. ఆ ఆహ్వాన పత్రికలో అమ్మణమ్మపుత్ర నారా చంద్రబాబునాయుడు గారు, వెంకటమ్మపుత్ర కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గారు అంటూ సంభోదించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్‌లుక్‌‌ని విడుదల చేశారు. ఇది అభిమానులను ఎంతగానో ఆకర్షిస్తుంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.