English | Telugu

హరిత దర్శకత్వంలో బాలయ్య హీరోయిన్ సినిమా ప్రారంభం

కాంచన, రూలర్ మూవీల్లో ఒన్ ఆఫ్ ది హీరోయిన్ గా చేసిన నటి వేదిక. ఈ సినిమాలకి ముందు కూడా ఆమె గతంలో కొన్ని సినిమాల్లో నటించి ప్రేక్షకులని తన నటనతో మెప్పించింది. ప్రస్తుతం ఆమె ఫియర్ అనే మూవీలో నటిస్తుంది. తాజాగా ఆ మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. ప్రముఖ సీనియర్ నటులు మురళీ మోహన్ పాల్గొని స్క్రిప్ట్ ని అందించగా డైరెక్టర్ కరుణాకరన్ క్లాప్ ని ఇచ్చాడు.


ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో హీరోయిన్ వేదిక మాట్లాడుతు ఫియర్ మూవీ షూటింగ్ కోసంఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నాను ఈ మూవీలో నా క్యారెక్టర్ మల్టీ డైమెన్షన్స్ తో ఉంటుంది. డైరెక్టర్ హరిత గోగినేని ఈ కథ నాకు చెప్పినప్పుడు బాగా ఇంప్రెస్ అయ్యాను. స్టోరీ తో పాటు మూవీలోని అన్ని క్యారెక్టర్ ల డిజైన్ లో హరిత గారు చాలా క్లారిటీగా ఉన్నారు. అలాగే దత్తాత్రేయ మీడియా సంస్థలో పనిచేయడం కూడా చాలా హ్యాపీగా ఉందని చెప్పడంతో పాటు మంచి టెక్నీషియన్స్ తో మూవీని చేస్తున్నామని తప్పకుండా అందరికీ నచ్చుతుందని కూడా వేదిక చెప్పింది.

దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ఏఆర్ అభి నిర్మిస్తున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ఫియర్ లో వేదిక తో పాటు ప్రముఖ హీరో అరవింద్ కృష్ణ ఒక స్పెషల్ రోల్ లో కనిపించనున్నాడు. వీరితో పాటు జయప్రకాష్, పవిత్ర లోకేష్, అనీష్ కురువిల్ల, సాయాజి షిండే, సత్య కృష్ణ, సాహితి దాసరి, షాని లాంటి భారీ తారాగణం కూడా ఈ మూవీలో నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్, సంగీతాన్ని అందిస్తుండగా ఎన్నో భారీ హిట్ చిత్రాల సినిమాటోగ్రఫర్ ఐ ఆండ్రూ కెమెరా బాధ్యతలని నిర్వహిస్తున్నాడు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.