English | Telugu

మహేష్ బాబు దూకుడు ఆడియో మే 31 రిలీజ్‍

మహేష్ బాబు దూకుడు ఆడియో మే 31 రిలీజ్‍ చేయబడుతుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, అందాల సమంత హీరోయిన్ గా, శ్రీను వైట్ల దర్శకత్వంలో అనీల్ సుంకర, గోపీ ఆచంట సమయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "దూకుడు". ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ముంబయ్ లో జరుగుతూంది. ముంబయ్ లో ఈ "దూకుడు" చిత్రానికి సంబంధించి హీరో మహేష్ బాబు ఇన్ ట్రడక్షన్ సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు. ఈ పాటకు రాజు సుందరం కొరియోగ్రఫీని నిర్వహిస్తున్నారు.

అనంతరం మరో పది రోజుల వరకూ "మహేష్ బాబు ఈ "దూకుడు" చిత్రం షుటింగ్ కోసం ముంబయ్ లోనే ఉంటారు. కారణం ఏమిటంటే ముంబయ్ లో జరిగే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ని ఆయన చూడనున్నారని సమాచారం. ఈ "దూకుడు" చిత్రంలో హీరో మహేష్ బాబు అండర్ కవర్ కాప్ గా నటిస్తున్నారని తెలిసింది. ఈ "దూకుడు" చిత్రం ఆడియో మే నెలలో 31 వ తేదీన ఘనంగా రిలీజ్ చేయబడుతుంది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.