English | Telugu

ఈ ఫొటోలో ఉన్న స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ ని గుర్తుపట్టారా..?

ఒకే రంగంలో ఎదగడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఇద్దరి మధ్య స్నేహం ఉండటం గొప్ప కాదు. ఎదిగిన తరువాత కూడా వారి మధ్య అదే స్నేహం కొనసాగడం గొప్ప. హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) ది అలాంటి గొప్ప స్నేహమే.

విజయ్, నాగ్ అశ్విన్ ఇంచుమించు ఒకే సమయంలో సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టారు. దాంతో వారి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఇప్పుడు సినీ ఫీల్డ్ లో ఇద్దరూ సక్సెస్ అయ్యారు. ఒకరి సక్సెస్ ని చూసి ఒకరు మురిసిపోతున్నారు. వీరి మధ్య ఎంత మంచి బాండింగ్ ఉందో.. గతంలో నాగ్ అశ్విన్ చెప్పిన మాటని బట్టి అర్థం చేసుకోవచ్చు. తాను చేసే ప్రతి సినిమాలో విజయ్ ఉంటాడని అన్నాడు. అన్నట్టుగానే ఇప్పటిదాకా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వచ్చిన మూడు సినిమాల్లో విజయ్ ఉన్నాడు. 'ఎవడే సుబ్రహ్మణ్యం', 'మహానటి' సినిమాల్లో కథకి కీలకమైన పాత్రలు విజయ్ పోషించాడు. ఇక రీసెంట్ గా వచ్చిన 'కల్కి 2898 AD' (Kalki 2898 AD)లో అర్జునుడి పాత్రలో విజయ్ కనిపించడం విశేషం. ప్రస్తుతం 'కల్కి' సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. ఈ క్రమంలో విజయ్, నాగ్ అశ్విన్ ఓల్డ్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫొటోలో విజయ్ చాలా యంగ్ గా మెరిసిపోతుండగా.. నాగ్ అశ్విన్ ఇప్పటికంటే బక్కగా, లాంగ్ హెయిర్ స్టైల్ తో ఉన్నాడు. ఇది కొన్నేళ్ల క్రితం ఓ ప్రైవేట్ పార్టీలో దిగిన ఫొటో. అప్పుడు ఆ ఫొటోలో ఉన్న కుర్రాళ్లే.. ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్స్ గా ఎదిగారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.