English | Telugu
'లోఫర్' గర్ల్ కేక పెట్టించింది
Updated : Dec 8, 2015
పూరీ జగన్నాధ్ 'లోఫర్' మూవీ హీరోయిన్ దిశా పటానీ ఆడియో ఫంక్షన్ లో అదరగోట్టేసింది. ఎవరైనా మొదటి చేస్తున్నారంటే ఎలా వుంటారు.. ఫంక్షన్లకి పిలిస్తే..టెన్షన్ పడుతూ పొడిపొడి మాటలతో సరిపెట్టేస్తారు. కానీ దిశా పటానీ మాత్రం..మాస్ పాటకు చిందేసి ఆడియో ఫంక్షన్ మొత్తానికి హైలైట్ గా నిలిచింది. ముఖ్యంగా నడుం తిప్పడంలో మరో ఇలియానాని గుర్తు చేసింది. చుట్టా బీడీ నోట్లో పెట్టు.. జర్దా బీడీ బిగించి కొట్టు.. అనే ఫుల్ మాస్ సాంగ్ కి.. దిశా పటానీ వేసిన స్టెప్స్ చూస్తే ఎవరైనా సరే.. ఔరా అనాల్సిందే. ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం ఈ అమ్మాయి గురించే చర్చలు నడుస్తున్నాయి. మొత్తానికి 'లోఫర్' గర్ల్ ఇండస్ట్రీ హాట్ గర్ల్ గా మారిపోయింది.