English | Telugu

రాజు గారి చేతిలో 'భలే మంచి రోజు'

ఈ సంవత్సరం నిర్మాత దిల్ రాజు పట్టిందల్లా బంగారం అయ్యింది. 2015 టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ఎవరంటే ? దిల్ రాజే అని చెప్పాలి. ఈ సంవత్సరం ‘పటాస్’ తో మొదలైన ఆయన విజయయాత్ర ‘బాహుబలి’, రుద్రమదేవి, రీసెంట్ గా కుమారి కుమారి 21 ఎఫ్ వరకు కొనసాగుతూనే వుంది. ఇప్పుడు దిల్ రాజు చేయి ఓ చిన్న సినిమాపై పడడంతో ఆ సినిమా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా నిలిచింది. ఆ సినిమా మరేదో కాదు.. సుధీర్ బాబు నటించిన ‘భలే మంచి రోజు’. ఈ మధ్యే ప్రివ్యూ చూసిన రాజు మరో ఆలోచన లేకుండా నైజాం ఏరియా రైట్స్ కోసం నిర్మాతల చేతిలో అడ్వాన్స్ పెట్టేశాడట. ఇక రాజు హ్యాండ్ పడటంతో సుధీర్ బాబు కూడా చాలా హ్యాపీగా వున్నాడట. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా సుధీర్ బాబు కోరుకుంటున్న భలే మంచి హిట్ ఇస్తుందేమో వేచి చూడాలి.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.