English | Telugu

అమ్మాయిల కోసమే సినిమాల్లోకి.. తండ్రిలాగానే ఎఫైర్స్  

'డ్రింకర్ సాయి'(Drinker Sai)చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందిన నటుడు ధర్మ మహేష్'(Dharma Mahesh).గత ఏడాది డిసెంబర్ 27 న విడుదలైన ఈ మూవీలో టైటిల్ రోల్ లో అద్భుతమైన పెర్ ఫార్మెన్స్ ని ప్రదర్శించాడు. ధర్మకి 2019లో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ గౌతమి(Gautami)తో వివాహం జరగగా ఇద్దరికి ఒక కుమారుడు ఉన్నాడు. కొన్ని రోజుల క్రితం ధర్మపై ఆయన భార్య గౌతమి, హైదరాబాద్(Hyderabad)గచ్చిబౌలి మహిళా పోలీస్‌ స్టేషన్లో వేధింపుల కేసుని నమోదు చేసింది.


తాజాగా ధర్మ మహేష్ గురించి గౌతమి మాట్లాడుతు నేను మంచి వాల్యూ ఉన్న కుటుంబం నుంచి వచ్చాను. పద్దతి గల ఆడదాన్ని. లా స్టూడెంట్ ని. ధర్మ మహేష్ ఒక వుమనైజర్. (Womanizer).ఇంజనీరింగ్ లో పాలిటిక్స్ కి వెళ్తా అన్నాడు. అలాంటిది అమ్మాయిల కోసమే సినిమాల్లోకి వచ్చాడు. కొంత మంది యువతులతో అక్రమ సంబంధం ఉంది. ఒక సీనియర్ యాంకర్ తో రిలేషన్ కూడా ఉంది. అందుకు సంబంధించిన ఆధారాలు నా వద్ద ఉన్నాయి. వాళ్ల ఫాదర్ లాగా ఆడవాళ్ళతో ఎఫైర్స్పెట్టుకోవాలని చూస్తున్నాడు. తల్లి కూడా సపోర్ట్. నేను ఎలా అయినా తిరుగుతాను. కానీ నా భార్యగా నిన్ను బయట పరిచయం చేసుకోను. సూపర్ స్టార్స్ ల ఫ్యామిలీ నా వెనక ఉంది. సెలబ్రటీస్ వైఫ్ నా వైపు ఉన్నారు. నేను ఎఫ్ఫైర్ పెట్టుకున్న వాళ్ళు నాతోనే కాదు చాలా మందితో కలుస్తారు. అలాంటి వాళ్ళని నీ మీదకి ఉసికొల్పానంటే నీ పని ఏమవుతుందో చూడు అని అంటాడు.

సిందూరం సినిమా షూటింగ్ అప్పుడు ధర్మ కి ఫుడ్ పాయిజన్ అయితే, ఎలా ఉందో అని అతి వేగంతో కారు నడుపుకొని వెళ్ళాను. అప్పెండిసిటిస్ అయితే నేనే దగ్గరుండి చూసుకున్నాను. అతను హీరో అవ్వాలని తిరుపతి కొండ రెండు సార్లు ఎక్కాను. అలాంటి నేను ధర్మతో పాటు అతని కుటుంబ సభ్యుల వల్ల ఎంతో మానసిక క్షోభ అనుభవించాను. హీరోయిన్ ని మూడు రోజులు ఇంట్లో పెట్టుకున్నారు. కానీ నన్ను, నా బిడ్డని గది వైపు కూడా వెళ్లనివ్వ లేదు. రెండు నెలల వయసున్న నా బాబుకి పాలు ఇస్తుంటే నీ బిడ్డ ఐదేళ్లు బతుకుతాడు, అఘోర చెప్పాడని అత్త, ఆడపడుచు అంటారు. నా బిడ్డ నాకు ముఖ్యం. అందుకే మ్యూచువల్ డైవర్స్ ఇచ్చి నన్ను వదిలెయ్యమని అడుగుతున్నానని గౌతమి చెప్పుకొచ్చింది. మ్యూచువల్ డైవర్స్ అంటే పరస్పర అంగీకారంతో తీసుకుంటారు. సోషల్ మీడియాలో సెలబ్రటీ గా ఉన్న గౌతమి కి ఎంతో మంది ఫాలోవర్స్ ఉన్నారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.