English | Telugu

డాక్టర్ ని పెళ్లాడబోతున్న పుష్ప ఫేమ్ జాలి రెడ్డి 

పుష్ప పార్ట్ 1(pushpa)ద్వారా తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకున్న కన్నడ నటుడు ధనుంజయ్. అందులో జాలి రెడ్డి అనే క్యారక్టర్ లో ఎంతో పవర్ ఫుల్ గా చేసి చిత్ర విజయంలో తను కూడా ఒక భాగమయ్యాడని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడు పుష్ప పార్ట్ 2(pushpa 2)లోను తన సత్తా చాటబోతున్నాడు.

రీసెంట్ గా ధనుంజయ్(dhananjaya)కి ధన్యత అనే అమ్మాయితో నిచ్చితార్ధం జరిగింది. కర్ణాటకలోని చిత్ర దుర్గం ఏరియాకి చెందిన ధన్యత డాక్టర్ గా వర్క్ చేస్తుంది. చాలా కాలంగా ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారు.ఇప్పుడు ఇరు వైపుల కుటుంబ సభ్యుల ఒప్పుకోవడంతో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు.

2013 లో డైరెక్టర్స్ స్పెషల్ అనే కన్నడ మూవీతో సినీ రంగ ప్రవేశం చేసిన ధనుంజయ్ పలు తెలుగు తమిళ, కన్నడ భాషల్లో కలిపి సుమారు ముప్పై చిత్రాల దాకా నటించాడు.కొన్ని చిత్రాలని నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా పాటల రచయితగా కూడా తన సత్తా చాటుతున్నాడు.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.