English | Telugu

ఆస్కార్ ని లాగేసుకున్నారు..ఆర్ఆర్ఆర్ పై తన మనసులో ఏముందో చెప్పేసింది  

భారతీయ సినీ ప్రేమికులకి పరిచయం అక్కర్లేని పేరు దీపికా పదుకునే.2006 లో కన్నడ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన దీపికా 2007 లో షారుక్ తో కలిసి 'ఓం శాంతి ఓం'తో బాలీవుడ్ లో అడుగుపెట్టింది.అప్ప్పట్నుంచి ఎన్నో సినిమాల్లో వివిధ పాత్రలని పోషిస్తు అగ్ర హీరోయిన్ లో ఒకరుగా కొనసాగుతు వస్తుంది.గత సంవత్సరం ప్రభాస్ తో కల్కి 2898 ఏడి లో కూడా చేసి తన సత్తా చాటింది.

రీసెంట్ గా దీపికా ఇనిస్టాగ్రమ్ లో ఒక వీడియోని షేర్ చేసింది.అందులో ఆమె ప్రపంచ సినీ మేకర్స్,నటులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 'ఆస్కార్' అవార్డు గురించి మాట్లాడుతు'చాలాసార్లు మనకి రావాల్సిన ఆస్కార్ ని లాగేసుకున్నారు.భారతీయ సినీ చరిత్రలో ఎన్నో గొప్ప కథలు తెరకెక్కాయి,కానీ వాటికి రావాల్సినంత ప్రత్యేక గుర్తింపు రాలేదు.ఆర్ ఆర్ ఆర్ కి ఆస్కార్ ని ప్రకటించగానే ఎంతో భావోద్వేగానికి లోనయ్యాను.ఆర్ ఆర్ ఆర్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు.కానీ ఒక భారతీయురాలిగా ఆర్ ఆర్ ఆర్ కి ఆస్కార్ రాగానే ఎంతో ఆనందం వేసింది.ఈ ఏడాది 'ది బ్రుటలిస్టు 'చిత్రానికి అడ్రిన్ బ్రాడి ఉత్తమ నటుడుగా నిలిచినందుకు కూడా ఎంతో ఆనందం వేసిందని చెప్పుకొచ్చింది.ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ని అందుకున్న సంవత్సరం దీపికా పదుకునే వేడుకలు జరిగిన లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఉండటంతో పాటు నాటు నాటు సాంగ్ ని దీపికా నే పరిచయం చేసిన విషయం తెలిసిందే.

దీపికా గత ఏడాది సెప్టెంబర్ లో ఒక ఆడబిడ్డకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే.దీంతో కొత్త సినిమాలని ఒప్పుకోలేదు.ఇప్పుడిప్పుడే మళ్ళీ నటించడానికి సిద్ధమవుతున్నానని ఇటీవల చెప్పుకొచ్చింది.


టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.