English | Telugu
మండే టెస్ట్.. నాలుగో రోజు కోర్ట్ మూవీకి షాకింగ్ కలెక్షన్స్!
Updated : Mar 18, 2025
న్యాచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ లో రూపొందిన చిత్రం 'కోర్ట్' (Court State Vs A Nobody). రామ్ జగదీష్ దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమాలో ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజీ ప్రధాన పాత్రలు పోషించారు. మార్చి 14 విడుదలైన కోర్ట్ మూవీ మంచి వసూళ్లతో అదరగొడుతోంది. నాలుగో రోజుల్లోనే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.29 కోట్ల గ్రాస్ రాబట్టింది. (Court Collections)
ప్రీమియర్స్ తో కలిపి మొదటి రోజు రూ.8.10 కోట్ల గ్రాస్ రాబట్టిన కోర్టు.. పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో అదే జోరు కొనసాగిస్తోంది. రెండో రోజు రూ.7.80 కోట్లు, మూడో రోజు రూ.8.50 కోట్ల కలెక్షన్స్ తో.. మొదటి వీకెండ్ లో రూ.24.40 కోట్ల గ్రాస్ సాధించింది. ఇక నాలుగో రోజు సోమవారం అయినప్పటికీ రూ.4.50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి, మండే టెస్ట్ కూడా పాస్ అయింది. దీంతో నాలుగో రోజుల్లో కోర్ట్ మూవీ రూ.28.90 కోట్లతో సత్తా చాటింది. ప్రస్తుత జోరు చూస్తుంటే ఫుల్ రన్ ఈ చిత్రం రూ.50 కోట్ల గ్రాస్ రాబట్టే అవకాశముంది.