English | Telugu

నా తమ్ముడిని గెలిపించండి.. కంటతడి పెట్టించేలా చిరంజీవి వీడియో!

తన తమ్ముడు, జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కోసం అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) రంగంలోకి దిగారు. పవన్ కళ్యాణ్ కి మద్దతుగా ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో తన తమ్ముడు గురించి చిరంజీవి చేసిన వ్యాఖ్యలు మనసుకి హత్తుకునేలా ఉన్నాయి.

"జనమే జయం అని నమ్మే జనసేనాని ని గెలిపించండి" అంటూ పవన్ కళ్యాణ్ కి మద్దతుగా చిరంజీవి స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. "కొణిదెల పవన్ కళ్యాణ్. మా అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టినా.. అందరికీ మంచి చేయాలి, మేలు జరగాలి అనే విషయంలో ముందువాడిగా ఉంటాడు. తన గురించి కంటే, జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాబుది. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలి అనుకుంటారు. కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనను ఎందరికో సాయం చేశాడు. తనని చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా ప్రజలకు కావాల్సింది అనిపిస్తుంది. సినిమాల్లోకి బలవంతంగా వచ్చాడు.. కానీ రాజకీయాల్లోకి మాత్రం ఎంతో ఇష్టంతో వచ్చాడు. ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే బాధగా ఉంటుంది. ఈ సందర్భంగా నేను మా అమ్మకి ఒక్కటి చెప్తాను. ఎందరో తల్లుల కోసం, వారి బిడ్డల భవిష్యత్ కోసం కళ్యాణ్ బాబు యుద్ధం చేస్తున్నాడమ్మా. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాళ్ళ వల్లే ప్రజాస్వామ్యానికి మరింత నష్టమని నమ్మి, జనం కోసం జనసైనికుడు అయ్యాడు. చట్టసభల్లో కళ్యాణ్ లాంటి నాయకుడి గొంతు మనం వినాలి. జనమే జయం అని నమ్మే జనసేనాని ని గెలిపించండి." అంటూ చిరంజీవి వీడియోలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .