English | Telugu

చిరంజీవి గన్ తో బెదిరించింది నిజం..ఆధారాలతో సహా బయటపడింది

తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న ఎన్నో హిట్ ఫెయిర్ లలో మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi)సుహాసిని(suhasini)ల జంట కూడా ఒకటి.ఆ ఇద్దరి కాంబోలో వచ్చిన మగ మహారాజు,రాక్షసుడు, ఛాలెంజ్, మరణమృదంగం, చంటబ్బాయ్, ఆరాధన వంటి పలు చిత్రాలు ప్రేక్షకులని ఎంతగానో అలరించాయి. నేటికీ చాలా ఫంక్షన్స్ లో ఆయా సినిమాల పాటలు మారుమోగిపోతుంటాయి. ఆ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం సినిమాలతోనే ఆగిపోలేదు.ఇప్పటికి బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటు ఫ్యామిలీ ఫంక్షన్స్ లో కూడా పాల్గొంటారు. ప్రెజంట్ ఆ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తుంది.

చిరు,సుహాసిని లు వీడియో కాల్ లో మాట్లాడుకుంటున్నారు. ఆ తర్వాత సుహాసిని ప్రేక్షకులతో మాట్లాడుతు ఇప్పుడు అందరకి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఒకసారి నేను, చిరంజీవి షూటింగ్ కోసం కేరళలోని ఒక లొకేషన్ కి కారులో బయలుదేరాం.ముందు కారులో చిరంజీవి వెళ్తుండగా వెనుక కారులో నేను డాన్స్ మాస్టర్స్, హెయిర్ డ్రస్సర్ వెళ్తున్నాం. ఆ తర్వాత అనుకోకుండా కొందరు తాగుబోతులు మా కారుపై బీరు సీసాలు వేస్తూ వెంబడించారు. ఆ విషయాన్నీ గమనించిన చిరంజీవి వెంటనే కారు దిగి తన రివాల్వర్ తో బెదిరించాడు.దాంతో వాళ్లంతా అక్కడనుంచి పారిపోయారు.తెర పైనే కాదు రియల్ లైఫ్ లో కూడా చిరంజీవి హీరో అంటూ చెప్పింది.

ఆ తర్వాత చిరు తో ఈ విషయం మీకు గుర్తుందా అని అడగగా, గుర్తుంది ఆ రోజు మీకలా జరగడం అనూహ్య పరిణామం అని చెప్పాడు. కాకపోతే ఈ వీడియో ఎప్పటిదో అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు.ఇక ఈ వీడియోని చూసిన మెగా ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పాటుగా చిరు రియల్ హీరో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.