English | Telugu

చిరు150 వ సినిమా షురూ


సచిన్ వందో రన్ కోసం మ్యాచ్ లో ఆయన అభిమానులు ఎలా ఎదురు చూస్తారో చిరంజీవి 150వ సినిమా కోసం చిరూ అభిమానులూ దాదాపు 7 సంపత్సరాల నుంచి ఎదురుచూస్తున్నారని చెప్పాలి. 2007లో చేసిన ‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమా తర్వాత మెగా స్టార్ చిరంజీవి సినిమాలను పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. రాజకీయాల్లో బిజీ షెడ్యూల్స్‌తో గడిపిన చిరంజీవి ఇప్పుడు మళ్లీ సినిమాల వైపు దృష్టి పెడుతున్నారు అని సమాచారం.

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆయన 150 వ సినిమాని రామ్‌చరణ్ నిర్మించే అవకాశాలు కనిపించాయి. ఆ విషయం స్వయంగా రామ్ చరణే పలు ఆడియో ఫంక్షన్స్‌లో ఈ విషయం గురించి వివరించాడు. కానీ ఇప్పుడు సీన్ మారినట్లు తెలుస్తోంది. ఈ సినిమాని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించే అవకాశం వుందిప్పుడు. ఈ చిత్రానికి వివి వినాయక్ దర్శక బాధ్యతలు చేపట్టే నేపథ్యంలో కథా చర్చలు సాగుతున్నాయట. ఇక చిరంజీవి పుట్టిన రోజైన ఆగస్టు 22న అధికారకంగా చిత్రం ప్రారంభం కానుంది. మరిన్ని వివరాలు త్వరలోనే అధికారిక ప్రకటన ద్వారా తెలిసే అవకాశం వుంది. ఇక చిరంజీవి 150వ సినిమా ఉండదేమో అని అనుకున్న ఆయన అభిమానులకు ఇది తీపి వార్తే.

ఇక మరోవైపు రాజకీయంగా క్రియాశీలక పనులేమి లేవు కనుక చిరు ప్రత్యామ్నాయ అంశాల మీద దృష్టి పెట్టి వుంటారు. అందుకే హుటాహుటిన ఈ నిర్ణయం తీసుకుని వుంటారు. కలిసి రాని రాజకీయం ఎలా వున్నా 150వ సినిమాతో మళ్లీ చిరు అభిమానులకు దగ్గరవుతాడేమో చూడాలి

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.