English | Telugu

ఎమ్మెస్‌ నారాయణ మృతికి సినీ ప్రముఖుల సంతాపం

అద్భుతమైన నటుడిని కోల్పోయాం- బాలకృష్ణ

ఎమ్మెస్‌ నారాయణ అద్భుతమైన నటుడు. మంచి మిత్రుడు. పలు సినిమాల్లో కలిసి చేశాం. ఆయన మృతిచెందారన్న వార్త మనసును కలచివేసింది. ఈ మధ్య కూడా ‘లయన్‌’లో కలిసి నటించాం. అలాంటి గొప్ప నటుడిని పరిశ్రమ కోల్పోవడం బాధాకరం. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి.

గొప్ప మానవతావాది.. ఆర్ నారాయణ మూర్తి

ఎమ్మెస్ నారాయణ గొప్ప రచయిత, నటుడు అంతే కాకుండా గొప్ప మానవతావాది అని ఆర్ నారాయణ మూర్తి అన్నారు. ఎమ్మెస్ కోలుకుంటాడని ఆశించానని మూర్తి అన్నారు. ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటని నారాయణ మూర్తి పేర్కొన్నారు.

బాధాకర౦...అలీ

ఎమ్మెస్ నారాయణ మృతి బాధాకరమని ప్రముఖ హాస్యనటుడు అలీ అన్నారు. తామిద్దరం కలిసి వంద సినిమాలు పైగా కలిసి నటించామని గుర్తు చేసుకున్నారు. ఎమ్మెస్ రచయితగా వచ్చి, నటుడిగా తన మార్కుని ఏర్పరుచుకున్నారని అలీ తెలిపారు. దూకుడుకు అవార్డు వచ్చినప్పుడు ఎమ్మెస్ సంతోషించారని, ఒక అవార్డు వస్తే నటుడికి సపోర్ట్ గా ఉంటుందని ఆయన అన్నారని అలీ వెల్లడించారు. ఎమ్మెస్ కుటుంబానికి అలీ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

షాకింగ్ గా ఉంది.. చంద్రబోస్

ఎమ్మెస్ నారాయణ మృతి చాలా షాకింగ్ గా ఉందని, తట్టుకోలేక పోతున్నాని పాటల రచయిత చంద్రబోస్ తెలిపారు. తన తొలి నాళ్లలో రచయితగా పరిచయం అని ఎమ్మెస్ అద్భుత సంభాషణలు రాశారని గుర్తు చేసుకున్నారు. బోసు.. బోసు అని ఆప్యాయంగా పిలుస్తూ, తనను ఎమ్మెస్ కొడుకులా చూసుకునేవారని చంద్రబోస్ చెప్పారు. ఎమ్మెస్ నారాయణ కుటుంబానికి బోస్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

మిత్రున్ని కోల్పోయా..రంగనాథ్

మంచి మిత్రున్ని కోల్పోయానని నటుడు రంగనాథ్ అన్నారు. ఎమ్మెస్ నారాయణ సినిమా రంగంలోకి రాకుముందే తమ మధ్య సాన్నిహిత్యం ఉండేదని రంగనాథ్ తెలిపారు. తన కొడుకు, కూతురు పట్ల శ్రద్ధ తీసుకుని ప్రోత్సహిస్తూ తండ్రిగా కూడా పిల్లలకు న్యాయం చేశారన్నారు. ఎమ్మెస్ కుటుంబానికి రంగనాథ్ సానుభూతిని తెలియజేశారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.