English | Telugu

భ‌య‌పెడుతున్న‌ బాహుబ‌లి

చిత్రసీమ‌లో తాడు పాముగా మారి బుస‌లు కొట్ట‌డానికి, పాము తాడుగా వాడిపోవ‌డానికి అట్టే స‌మ‌యం ప‌ట్ట‌దు. ఇప్పుడు బాహుబ‌లి కూడా అంతే. ఈ సినిమా కూడా టాలీవుడ్‌ని క‌న్‌ఫ్యూజ‌న్‌లో ప‌డేస్తోంది. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి కూడా ఈ సినిమా రిలీజ్ విష‌యంలో పిచ్చ క‌న్‌ఫ్చూజ‌న్‌లో ఉన్నాడు. ముందు ఈ సినిమాని ఏప్రిల్‌లో విడుద‌ల చేస్తామ‌న్నారు. కానీ మాట త‌ప్పాడు. మే 15న ఖాయం అన్నాడు. మ‌ళ్లీ ఇప్పుడు ఈ సినిమా విడుద‌ల తేదీ వాయిదా ప‌డింది. అంటే ఈ సినిమా విష‌యంలో రాజ‌మౌళికి అప్పుడే క‌న్‌ఫ్యూజ‌న్ మొద‌లైపోయింద‌న్న‌మాట‌. అస‌లు బాహుబ‌లి సినిమాకి బిజినెస్ జ‌ర‌గ‌డం లేద‌న్న‌ది ఇన్‌సైడ్ టాక్‌. ప్ర‌భాస్ - రాజ‌మౌళి సినిమాల‌కు బిజినెస్‌తో ప‌నేంటి? అనుకోవ‌చ్చు. కానీ.. నిర్మాత‌లు భారీ రేట్లు చెబితే బ‌య్య‌ర్లు జ‌డుసుకోక ఏం చేస్తారు? నైజాం రూ.30 కోట్లు అడిగితే కొనే నాధుడెవ‌రు? గుంటూరు, కృష్ణ‌, ఈస్ట్‌, వెస్ట్ ఏ ఏరియా తీసుకొన్నా పాతిక కోట్ల‌కు త‌గ్గ‌డం లేదు. సినిమా ఎంత హిట్ట‌యిపోయినా.. అస‌లు సంపాదించుకోవ‌డం గ‌గ‌నం అయిపోతుంది. అందుకే బ‌య్య‌ర్లు భ‌య‌ప‌డుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ సినిమాకి శాటిలైట్ జ‌ర‌గ‌లేదు. రూ.170 కోట్ల‌ని ఎలా రాబ‌ట్టుకోవాలా అని నిర్మాత‌లు చూస్తున్నారు. ఈ సినిమాకి త‌క్కువ రేట్ల‌కు ఎలా కొట్టేద్దామా అని బ‌య్య‌ర్లు చూస్తున్నారు. దాంతో బేరాలు తెగ‌డం లేదు. అందుకే రిలీజ్ డేటు వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. ఇప్పుడు కొత్త‌గా మే 23 అంటున్నారు. అప్ప‌టికైనా వ‌స్తుందా..?? అనేది డౌటే.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...