English | Telugu

'NBK 109' నుండి బిగ్ అప్డేట్.. ఇక బాలయ్య ఫ్యాన్స్ రెచ్చిపోండి!

నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తన 109వ సినిమాని బాబీ కొల్లి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. 'NBK 109' అనే వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రం రూపొందుతోంది. 'అఖండ', 'వీరసింహ రెడ్డి', 'భగవంత్ కేసరి' వంటి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత బాలయ్య నటిస్తున్న సినిమా కావడంతో 'NBK 109'పై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, బాలకృష్ణ బర్త్ డే గ్లింప్స్ ఆకట్టుకొని.. సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో అదిరిపోయే అప్డేట్ వచ్చింది.

'NBK 109' అప్డేట్ ని ట్విట్టర్(ఎక్స్) వేదికగా డైరెక్టర్ బాబీ పంచుకున్నారు. బాలయ్యతో దిగిన ఫొటోని షేర్ చేసిన ఆయన.. జైపూర్ లో బాలకృష్ణ గారితో #NBK109 మోస్ట్ ఇంటెన్స్ షెడ్యూల్ పూర్తి చేశామని తెలిపారు. ఈ ఎలక్ట్రిఫైయింగ్ సీక్వెన్స్ లలో బాలకృష్ణ గారి అసమాన ఎనర్జీని చూడటానికి సిద్ధంగా ఉండండని బాబీ పేర్కొన్నారు. అలాగే టైటిల్ టీజర్ ని త్వరలోనే విడుదల చేయనున్నట్లు చెప్పి బాలయ్య ఫ్యాన్స్ కి మరింత కిక్ ఇచ్చారు. కాగా ఈ సినిమాకి 'వీరమాస్'​ అనే టైటిల్ లాక్ చేసినట్లు గతంలో ప్రచారం జరిగింది.

ఫార్చూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఫిల్మ్ లో బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, 'జైలర్' ఫేమ్ విజయ్ కార్తీక్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. ఎడిటర్ గా నిరంజన్, ప్రొడక్షన్ డిజైనర్ గా అవినాష్ కొల్లా వ్యవహరిస్తున్నారు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.